
అరంగేట్రం చేసిన అతి తక్కువ రోజుల్లో 6000:
రికార్డు సాధించిన వయస్సులో పెద్ద గుర్తింపు లేకపోయినా.. అరంగేట్రం చేసిన అతి తక్కువ రోజుల్లో 6000 పరుగులు చేసింది మాత్రం జో రూటే. అరంగేట్రం చేసిన 2,058 రోజుల్లో రూట్ 6,000 పరుగుల మైలురాయి చేరుకున్నాడు. ఆ తర్వాతి స్థానంలో అలిస్టర్ కుక్ (2,168) ఉన్నాడు. టాప్-5 జాబితాలో భారతీయులు లేరు.

భారత్‌కు అదిరే ఆరంభం
ఈ క్రమంలోనే టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రూట్ హాఫ్ సెంచరీ సాధించాడు. భారత్‌పై ఇది అతడికి 12వ అర్ధశతకం కావడం గమనార్హం. ఇషాంత్ శర్మ వేసిన 42.5వ బంతికి ఒక పరుగు తీసి రూట్(53) 115 బంతుల్లో 6 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. కాగా, ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్‌కు అదిరే ఆరంభం లభించింది. బౌలర్లు అనూహ్యంగా చెలరేగిపోవడంతో తొలి టెస్టు తొలి రోజు ఇంగ్లాండ్ చతికిలబడింది. ఆట ఆఖరుకు 88 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది.

భారత్‌కు కష్టమే.. ఇంగ్లాండ్ భారీ స్కోరు ఖాయమే:
ఒక దశలో ఇంగ్లాండ్ స్కోరు 216/3. రూట్ సెంచరీ వైపు పరుగులు పెడుతున్నాడు. బెయిర్ స్టో కూడా అదే బాటలో సాగుతున్నాడు. ఇద్దరూ ఏ తడబాటూ లేకుండా బ్యాటింగ్ సాగిస్తున్నారు. వారి భాగస్వామ్యం సెంచరీ కొట్టేసింది. ఇక భారత్‌కు కష్టమే.. ఇంగ్లాండ్ భారీ స్కోరు చేయడం ఖాయమే అనే భావన అందరిలో వచ్చేసింది. అలాంటి సమయంలో లేని పరుగు కోసం రూట్ చేసిన ప్రయత్నం ఇంగ్లాండ్ కొంప ముంచింది.

రూట్ రనౌట్.. ఇంగ్లాండ్ కుదేలు:
మిడ్‌వికెట్ వైపు బెయిర్‌స్టో బంతిని ఆడగా.. తొలి పరుగు సులువుగా పూర్తి చేసి రెండో పరుగుకు ప్రయత్నించాడు. షార్ట్ మిడ్‌వికెట్‌లో ఉన్న కోహ్లి.. చురుగ్గా స్పందించి రెండో పరుగు మొదలయ్యే సమయానికి బంతిని అందుకున్నాడు. మెరుపు వేగంతో నాన్‌స్ట్రైక్ వైపు బంతిని విసిరాడు. అది నేరుగా వికెట్లను తాకడంతో రూట్ ఔటయ్యాడు. ఆ వికెట్‌తో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ గమనమే మారిపోయింది. 67 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోయింది.


Click it and Unblock the Notifications













