'కళ్ల ముందే రికార్డు బ్రేక్ చేయడం ఆనందంగా ఉంది'

హైదరాబాద్: భారీ అంచనాలతో ఆరంభించిన ఇంగ్లాండ్ పర్యటనను రెండు సిరీస్‌ల వైఫల్యాలతో టీమిండియా ముగించింది. భారత్‌తో జరిగిన చివరి టెస్టులో ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. మహ్మద్ షమీ వికెట్ పడగొట్టడం ద్వారా టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా అండర్సన్ రికార్డ్ క్రియేట్ చేశాడు. 563 వికెట్లు సాధించిన ఆస్ట్రేలియా పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌ను అతడు వెనక్కి నెట్టాడు.

కుక్ రిటైర్మెంట్ మ్యాచ్‌లో ఈ ఘనత ఆనందంగా :
బెస్ట్ ఫ్రెండ్ అలెస్టర్ కుక్ రిటైర్మెంట్ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించడం ఆనందంగా ఉందని అండర్సన్ తెలిపాడు. నా బెస్ట్ మేట్ కళ్ల ముందు 564 వికెట్ పడగొట్టడం ఆనందంగా ఉంది, ఇక నుంచి మైదానంలో కుక్‌ను మిస్సవుతానని అండర్సన్ తెలిపాడు. భారత బ్యాట్స్‌మెన్ భారీ భాగస్వామ్యం దిశగా సాగుతుండటంతో ఓ దశలో ఓడిపోతామని అనిపించిందని అండర్సన్ చెప్పుకొచ్చాడు. కానీ లయ తప్పకుండా బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టామన్నాడు.

మురళీధరన్ 800 వికెట్లతో అగ్రస్థానంలో
టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీలంక స్పిన్నర్ మురళీధరన్ ముత్తయ్య 800 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. షేన్ వార్నే 708 వికెట్లతో రెండో స్థానంలో, అనిల్ కుంబ్లే 619 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నారు. తర్వాతి స్థానంలో అండర్సన్ నిలిచాడు.

ఆఖరి టెస్టులో టీమిండియా 118 పరుగులతో
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చివరిదైన ఆఖరి టెస్టులో టీమిండియా 118 పరుగులతో ఓడిపోయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ (3/45), శామ్ కర్రన్ (2/23) రాణించారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో టెస్టు మినహా అన్నింటిని గెల్చుకున్న ఇంగ్లండ్ 4-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.

కోహ్లీ, శామ్ కర్రన్‌లకు 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్'
కెరీర్ చివరి టెస్టులో సెంచరీ సాధించిన ఆ జట్టు ఓపెనర్ అలిస్టర్ కుక్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కగా.... పరుగుల వరద పారించిన భారత కెప్టెన్ కోహ్లీ, ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన శామ్ కర్రన్‌లకు సంయుక్తంగా 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' పురస్కారం లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications