
హైదరాబాద్: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు హోరాహోరీగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య ఇంగ్లాండ్ నిలకడగా ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. కొత్త బంతిని ఇంగ్లాండ్ ఓపెనర్లు ధీటుగా ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్ల ఏడో ఓవర్లోనే అశ్విన్‌ను బరిలోకి దింపి ఆశ్చర్యపరిచాడు. తొలి ఓవర్‌ను కట్టుదిట్టంగా బౌలింగ్ వేసిన ఆ తర్వాతి ఓవర్లోనే మాయ చేశాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్ బౌలింగ్ చేసిన అశ్విన్ అద్భుతమైన బంతితో ఇంగ్లాండ్ ఓపెనర్ అలిస్టర్ కుక్(13: 28 బంతుల్లో 2 ఫోర్లు)ను బోల్తా కొట్టించాడు.
అశ్విన్ వైవిధ్య బంతిని డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించగా బంతి నేరుగా వెళ్లి వికెట్లను తాకింది. లెగ్‌స్టంప్ లైన్‌లో అశ్విన్ విసిరిన బంతిని డిఫెన్స్ చేసేందుకు అలిస్టర్ కుక్ ప్రయత్నించాడు. కానీ.. అనూహ్యంగా టర్న్ తీసుకున్న బంతి అతని బ్యాట్‌కి అందకుండా నేరుగా వెళ్లి ఆఫ్ స్టంప్‌ను గీరాటేసింది.
దీంతో కాసేపు ఏం జరిగిందో అర్థంకాక అలానే చూస్తుండిపోయాడు. అనంతరం.. నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. టెస్టుల్లో అశ్విన్ బౌలింగ్‌లో కుక్ ఔటవడం ఇది ఎనిమిదో సారి. అత్యధికంగా డేవిడ్ వార్నర్ తొమ్మిదిసార్లు అశ్విన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు పంపాడు. కుక్ తర్వాత ఆస్ట్రేలియా ఆటగాడు ఎడ్ కొవన్‌ను అశ్విన్ ఏడుసార్లు ఔట్ చేశాడు.
కుక్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ జో రూట్ వేగంగా ఆడుతున్నాడు. మరో ఓపెనర్ కీటన్ జెన్నింగ్స్‌కు సహకారం అందిస్తూ పరుగులు రాబడుతున్నాడు. దీంతో లంచ్ విరామ సమయానికి ఆతిథ్య ఇంగ్లాండ్ 83 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జో రూట్ (31), జెన్నింగ్స్ (38) పరుగులతో ఉన్నారు.
అంతకముందు ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో మరో ఓపెనర్ జెన్నింగ్స్ ఇచ్చిన క్యాచ్‌ని స్లిప్‌లో ఉన్న రహానే నేలపాలు చేశాడు.