Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లాండ్ పర్యటనకు ఆస్ట్రేలియా కెప్టెన్ వచ్చాడోచ్..!

England v Australia: Tim Paine named ODI captain for five-match series

హైదరాబాద్: బాల్‌ టాంపరింగ్‌ ఉదంతంతో అతలాకుతలం అయిపోయిన ఆస్ట్రేలియా జట్టు నిదానంగా కుదరుకుంటోంది. ఈ క్రమంలో ఏడాది పాటు నిషేదానికి గురైన స్మిత్ అందుబాటులో లేకపోవడంతో కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. టాంపరింగ్ వివాదానంతరం జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన టిమ్ ఫైన్‌నే జట్టు కెప్టెన్‌గా నిర్దేశించింది. త్వరలో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్ పర్యటన చేయనుంది. ఈ నేపథ్యంలో వన్డే, టీ20 జట్లకు కెప్టెన్లను, ఆటగాళ్లను తీసుకున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ జాతీయ సెలక్టరు ట్రెవర్ హాన్స్ ప్రకటించారు.

ఆసీస్‌ కెప్టెన్‌గా టిమ్‌ పైన్‌ను ఎంపిక

ఆసీస్‌ కెప్టెన్‌గా టిమ్‌ పైన్‌ను ఎంపిక

జూన్‌లో ఆసీస్‌..ఐదు వన్డేలు‌, ఒక టీ20 మ్యాచ్‌ కోసమని ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో ఈ పర్యటనలో వన్డే సిరీస్‌కు ఆసీస్‌ కెప్టెన్‌గా టిమ్‌ పైన్‌ను ఎంపికచేసినట్లు ఆస్ట్రేలియా కొత్త కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ మంగళవారం పేర్కొన్నారు.

 తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన

తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన

టిమ్‌ పైన్‌.. బాల్‌ టాంపరింగ్ ఉదంతం అనంతరం దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు‌కు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం విదితమే. దీంతో ఇంగ్లాండ్‌తో వన్డే జట్టుకు కెప్టెన్‌గా పైన్‌ను, వైస్‌ కెప్టెన్‌గా అరోన్‌ ఫించ్‌ను ఎంపిక చేసినట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా సెలక్టర్స్‌ ఛైర్మన్‌ తెలిపారు.

స్టార్క్, కమిన్స్ అందుబాటులో

స్టార్క్, కమిన్స్ అందుబాటులో

2019 వరల్డ్‌కప్‌ ఇంగ్లాండ్‌లోనే జరుగుతున్నందున ప్రస్తుత పర్యటన ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఎంతగానో తోడ్పాటునిస్తుందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఏకైక టీ20 మ్యాచ్‌కు కెప్టెన్‌గా అరోన్‌ ఫించ్‌ నాయకత్వం వహిస్తారని తెలిపారు. ఈ పర్యటనకు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ అందుబాటులో ఉండరు. 2016లో ఆస్ట్రేలియా తరపున ఆడిన నాథన్ లియోన్ జట్టులో భాగం కానున్నాడు.

 వైట్ బాల్ క్రికెట్‌కు కొత్తేం కాదు

వైట్ బాల్ క్రికెట్‌కు కొత్తేం కాదు

ఈ సందర్భంగా సెలక్లర్ హాన్స్ మాట్లాడుతూ.. 'నాథన్ వైట్ బాల్ క్రికెట్‌కు కొత్తేం కాదు. సాధారణంగా ఇంగ్లాండ్ జట్టులో లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్లు ఎక్కువ. వారిని ఎదుర్కొనేందుకు జట్టులో మార్పులు చేపడుతున్నాం' అని పేర్కొన్నాడు. ఈ పర్యటన అనంతరం ఆస్ట్రేలియా జట్టు జింబాబ్వే పర్యటన చేయనుంది.

Story first published: Tuesday, May 8, 2018, 15:51 [IST]
Other articles published on May 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+