For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరో 312 పరుగులు.. టెస్ట్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించనున్న దక్షిణాఫ్రికా!!

England tour of South Africa: South Africa on the verge of new record in Test Cricket

కేప్‌టౌన్‌: ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఐదో రోజు మరో 312 పరుగులు చేస్తే టెస్టుల్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా దక్షిణాఫ్రికా రికార్డుల్లోకి ఎక్కుతుంది. ప్రొటీస్ ఇప్పటికే వన్డేల్లో అత్యధిక పరుగుల (438) లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు టెస్టుల్లో కూడా ఆ ఘనతను ఖాతాలో వేసుకునేందుకు దక్షిణాఫ్రికాకు ఇంతకుమించిన మరో అవకాశం రాదు.

లక్ష్యం 438:

లక్ష్యం 438:

రెండో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ప్రొటీస్ 223 పరుగులు చేసి కుప్పకూలింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ సోమవారం నాలుగో రోజు 391/8 వద్ద డిక్లేర్‌ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకొని ప్రొటీస్ ముందు 438 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రస్తుతం ప్రొటీస్ రెండు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఓపెనర్ పీటర్‌ మలాన్‌ (63) హాఫ్ సెంచరీ చేసి ఫామ్‌లో ఉన్నాడు. డుప్లెసిస్, డికాక్, డుస్సేన్ బ్యాటింగ్ చేయాల్సి ఉంది. ఇద్దరు నిలబడ్డా లక్ష్యాన్ని ఛేదించే అవకాశం ఉంది.

అండగా అభిమానులు, మాజీలు:

అండగా అభిమానులు, మాజీలు:

అభిమానులు, మాజీలు సోషల్‌ మీడియాలో దక్షిణాఫ్రికా జట్టుకు అండగా నిలుస్తున్నారు. దక్షిణాఫ్రికా 2006లోనే ఆస్ట్రేలియా వంటి పటిష్ట జట్టుపై భారీ స్కోరును ఛేదించింది, ఇప్పుడు ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 438 లక్ష్యాన్ని ఛేదిస్తుందని అభిమానులు సోషల్‌ మీడియాలో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టెస్టుల్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా ప్రొటీస్ రికార్డు సృష్టిస్తుందని అభిమానులు ధీమాగా ఉన్నారు.

438 పరుగులు ఛేదించిందా:

438 పరుగులు ఛేదించిందా:

అయితే సోషల్‌ మీడియాలో ఈ చర్చకు మాత్రం ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌. 'దక్షిణాఫ్రికా గతంలో ఎప్పుడైనా 438 పరుగులను ఛేదించిందా' అని పీటర్సన్‌ ఓ ట్వీట్‌ చేసాడు. దీనిపై సఫారీల మాజీలు స్పందించారు. జాక్వెస్‌ రుడోల్ఫ్‌ స్పందిస్తూ... 'దక్షిణాఫ్రికా 50 ఓవర్లలోనే 438 పరుగులను చేధించింది. ఇంకా మిగిలున్న నాలుగు సెషన్లలో తప్పకుండా ఛేదిస్తుంది' అని ట్వీట్‌ చేశాడు. దక్షిణాఫ్రికా ఎక్కువ ఆలోచించకపోతే మ్యాచ్‌ గెలిచేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని గిబ్స్‌ అంటున్నాడు.

విజయానికి 312 పరుగులు:

విజయానికి 312 పరుగులు:

మంగళవారం చివరి రోజు దక్షిణాఫ్రికా విజయం సాధించాలంటే ఇంకా 312 పరుగులు చేయాలి. క్రీజులో పీటర్‌ మలాన్‌ ఉండడం కాస్త ఊరటకలిగించే అంశం. అయితే, గత ఆరు టెస్టుల్లో సఫారీలు 300 స్కోర్‌ దాటకపోవడం ఆందోళన కలిగించే విషయం. ఒకవేళ దక్షిణాఫ్రికా ఈ లక్ష్యాన్ని ఛేదిస్తే చరిత్ర సృష్టించనుంది.

గిబ్స్ భారీ సెంచరీ:

గిబ్స్ భారీ సెంచరీ:

2006లో ఒక వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 434 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 438 పరుగులు చేసి సునాయాస విజయం సాధించింది. ఇది వన్డే చరిత్రలోనే అతిగొప్ప మ్యాచ్‌గా పేరుగాంచింది. ఆసీస్ ఆటగాళ్లలో రికీ పాంటింగ్ (164) సెంచరీ చేసాడు. గిబ్స్ (175) సెంచరీ చేయగా.. బౌచర్ (50) విజయతీరాలకు చేర్చాడు.

Story first published: Thursday, April 30, 2020, 13:01 [IST]
Other articles published on Apr 30, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+