పరిస్థితులు కఠినంగా: ఇంగ్లాండ్ చేతిలో టెస్టు సిరిస్ ఓటమిపై ద్రవిడ్

హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనకు వచ్చేసారి పూర్తి సన్నద్ధమై వెళ్లాలని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో కోహ్లీసేన కఠిన పరిస్థితులను ఎదుర్కొందని ఆయన పేర్కొన్నారు. ఇంగ్లీషు గడ్డపై ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను కోహ్లీసేన 1-4తో చేజార్చుకున్న సంగతి తెలిసిందే.
అయితే, ఇంగ్లాండ్‌లో చివరి సారిగా టీమిండియా ద్రవిడ్ సారథ్యంలోనే టెస్టు సిరీస్‌ను గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ "నిజాయతీగా చెప్పాలంటే ఇంగాండ్‌లో పరిస్థితులు బ్యాటింగ్‌కు అంత తేలిగ్గా లేవు. రెండు జట్ల బ్యాట్స్‌మెనూ ఇబ్బందిపడ్డారు. విరాట్ కోహ్లీని మినహాయిస్తే బ్యాట్స్‌మెన్‌కు ఈ సిరీస్ సులభంగా ఏమీ లేదు" అని అన్నాడు.

ఐదు టెస్టుల సిరీస్‌లో పరిస్థితులు కఠినంగా ఉన్నాయి
"ఇంగ్లాండ్‌లో నేను ఇంతకు ముందు ఆడాను. ఐదు టెస్టుల సిరీస్‌లో పరిస్థితులు కఠినంగా ఉన్నాయి. వచ్చేసారి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లేటప్పుడు అలాంటి పరిస్థితులకు మరింత మెరుగ్గా సన్నద్ధం కావాలి. అక్కడి కఠిన పరిస్థితుల్లో అత్యుత్తమ ఆటను వెలికితీయాలి. అక్కడ ఇబ్బందిగానే ఉంటుంది. దానిని ఎదుర్కోవాలి" అని ద్రవిడ్ అన్నాడు.

రవిశాస్త్రి వ్యాఖ్యలపై ఆసక్తి లేదు
"కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యలపై ఆసక్తి లేదు. ఆ సిరీస్ నుంచి మనం ఏం నేర్చుకున్నామన్నదే ముఖ్యం. ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో మూడు నాలుగేళ్లకు ఒకసారి పర్యటిస్తుంటారు. జట్టు ఓటమి పాలవ్వడంతో కోచింగ్ బృందం, ఆటగాళ్లు నిరాశపడుతుంటారు. ఈ సారి మనకు ఉత్తమ జట్టు ఉంది. బౌలింగ్ బాగుంది కానీ దాంతో తగిన ఫలితాలు రాలేదు" అని ద్రవిడ్ అన్నాడు.

సిరీస్ గెలిచేందుకు టీమిండియాకు చాలా అవకాశాలు
"సిరీస్‌లో చాలా భాగం మంచి పోటీలోనే ఉంది. సిరీస్ గెలిచేందుకు టీమిండియాకు చాలా అవకాశాలు వచ్చాయి. కఠిన పరిస్థితుల్లో ఆటగాళ్లు కష్టపడ్డారు. అవకాశాలను మాత్రం అందిపుచ్చుకోలేదు. మ్యాచ్‌లను సరిగా ముగించలేకపోయారు. సిరీస్‌లో కొన్ని సానుకూలాంశాలున్నాయి. మన బౌలింగ్, ఫీల్డింగ్ చాలా బాగున్నాయి" అని ద్రవిడ్ పేర్కొన్నాడు.

ఆసియా కప్‌పై స్పందించిన రాహుల్ ద్రవిడ్
ఇక, ఆసియా కప్ విషయానికి వస్తే, భారత్ కేవలం పాకిస్థాన్‌పైనే దృష్టి పెడుతుందని... అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ పోటాపోటీగా ఆడుతున్నాయి. అన్ని జట్లపై దృష్టి కేంద్రీకరించాలని ద్రవిడ్ చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications