జాతి వివక్షకు వ్యతిరేకంగా వెస్టిండీస్ బాటలోనే ఇంగ్లండ్.!

లండన్‌: ఇంగ్లండ్‌తో జరిగే తొలి టెస్టులో జాతి వివక్షకు వ్యతిరేకంగా తమ జెర్సీ కాలర్‌పై 'బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌' అని ముద్రించిన లోగోతో బరిలోకి దిగుతామని వెస్టిండీస్ ఆటగాళ్లు ప్రకటించిన విషయం తెలిసిందే. జాతి వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం గురించి ప్రచారం చేసే, దానికి సంఘీభావం తెలిపే బాధ్యత తమకుందని భావిస్తున్నట్లు వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్టర్ తెలిపాడు. దీనికి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కూడా ప్రత్యేక అనుమతి ఇచ్చింది. అయితే తాజాగా జాతి వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో భాగమయ్యేందుకు ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా ముందుకు వచ్చారు.

అవగాహన కల్పించాలి..

అవగాహన కల్పించాలి..

విండీస్ ఆటగాళ్లతో పాటు తాము కూడా 'బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌' అని ముద్రించిన లోగోతో బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. దీంతో జూలై 8 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్ట్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు ఒకే లోగోతో బరిలోకి దిగి జాతి వివక్షపై అవగాహన కల్పించనున్నారు. నల్లజాతీయులకు సంఘీభావం తెలపడంతో పాటు అండగా నిలవాల్సిన అవసరం చాలా ఉందని ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ తెలిపాడు. ‘నల్లజాతీయులకు సంఘీభావం తెలపడంతో పాటు సమానత్వం, సమన్యాయంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.'అని జోరూట్ అభిప్రాయపడ్డాడు.

మా మద్దతుంటుంది..

మా మద్దతుంటుంది..

అంతర్జాతీయ క్రికెట్ టోర్నీల వేదికగా జాతి వివక్షను నిర్మూలించే కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని, ఇంగ్లండ్ ఆటగాళ్లుతో పాటు టీమ్ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. ‘మనలో చాలా మందికి వ్యక్తిగతంగా ప్రాంత, వర్ణ, మైనార్టీ వివక్షల గురించి తెలియదు. ఓ గ్రూప్‌గా ఈ వివక్షలపై కొంత నేర్చుకోవడంతో పాటు అవగాహన తెచ్చుకోవచ్చు.'ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్ తెలిపింది. అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యానంతరం 'బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌' పేరుతో ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతున్న విషయం తెలిసిందే. విండీస్‌ ఆటగాళ్లు ధరించబోయే లోగోను అలీషా హోసానా డిజైన్‌ చేయగా... ఇటీవల మళ్లీ ప్రారంభమైన ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో 20 జట్ల ఆటగాళ్లు ఈ లోగోను ధరించారు. సరిగ్గా ఆ లోగోకే ఐసీసీ అనుమతి ఇచ్చింది.

ఐసీసీపై వ్యతిరేకత..

ఐసీసీపై వ్యతిరేకత..

అయితే బ్లాక్ మ్యాటర్ లోగోకు అనుమతివ్వడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఇది ఐసీసీ ద్వంద్వ ప్రమాణలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్‌ ధోని తన వికెట్‌ కీపింగ్‌ గ్లవ్స్‌పై డాగర్‌ గుర్తు ముద్రించి ఉన్న ‘బలిదాన్‌ బ్యాడ్జ్‌'ను ధరించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. దానిని తర్వాతి మ్యాచ్‌ నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంది.

 ఇదేలా భిన్నమో చెప్పాలి..

ఇదేలా భిన్నమో చెప్పాలి..

ఇప్పుడు ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌' వీటికి ఎలా భిన్నమో ఐసీసీనే చెప్పాలని భారత అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఎలా చూసుకున్నా తాజా అమెరికా అంశానికి కూడా ఆటలతో సంబంధం లేదని, వ్యక్తిగతంగా బయట ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా.. మైదానంలోకి వచ్చేసరికి ఏ క్రీడలోనైనా అంతా ఒక్కటే అంటూ బరిలోకి దిగడం ప్రాథమిక స్ఫూర్తని అభిప్రాయపడుతున్నారు. ఇక తాము ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తలేమని, కానీ ధోనీ విషయంలో ఎందుకు అంత మొండిగా వ్యవహరించారని మండిపడుతున్నారు.

కరోనా కారణంగా మార్చి నుంచి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ ఆగిపోయింది. ఇప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ‘బయో సెక్యూర్‌ బబుల్‌' వాతావరణంలో వెస్టిండీస్‌కు సొంతగడ్డపై ఆతిథ్యం ఇచ్చేందుకు ఇంగ్లండ్‌ బోర్డు సిద్ధమైంది. విరామం తర్వాత జరగనున్న తొలి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ ఇదే కానుంది. ఇక తొలి మ్యాచ్‌కు ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ దూరంకానున్నాడు. తన సతీమణి ప్రసవసం కోసం అతను వెళ్లనుండటంతో ఇంగ్లండ్.. స్టోక్స్‌కు జట్టు పగ్గాలను అందించింది.

రాంచీలో ధోనీ ఏదో చేశాడు.. లేకుంటే నెట్స్‌లో అలా ఎలా ఆడుతాడు: సీఎస్‌కే స్పిన్నర్

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, July 3, 2020, 14:20 [IST]
Other articles published on Jul 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X