For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ, స్మిత్ మాదిరి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా: జో రూట్

కెప్టెన్లుగా, బ్యాట్స్‌మెన్లుగా రాణిస్తున్న విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్‌లే తనకు ఆదర్శమని చెప్పాడు. 'ఆయా జట్ల కెప్టెన్లుగా కోహ్లీ, స్మిత్‌లకు తిరుగులేదు. ఆ ఇద్దరూ కెప్టెన్లుగా నియమించబడ్డ తరువాత అద్భు

By Nageshwara Rao

హైదరాబాద్: గత వారంలో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్‌గా జో రూట్ ఎంపికైన సంగతి తెలిసిందే. కెప్టెన్సీ బాధ్యతల నుంచి అలెస్టర్ కుక్ వైదొలగిన తర్వాత అతడి స్థానంలో వైస్ కెప్టెన్‌గా ఉన్న జో రూట్‌కు ఆ బాధ్యతలను అప్పగించారు.

బుధవారం తన సొంత మైదానమైన హెడెంగ్లీలో మీడియాతో మాట్లాడిన జో రూట్ కెప్టెన్లుగా, బ్యాట్స్‌మెన్లుగా రాణిస్తున్న విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్‌లే తనకు ఆదర్శమని చెప్పాడు. 'ఆయా జట్ల కెప్టెన్లుగా కోహ్లీ, స్మిత్‌లకు తిరుగులేదు. ఆ ఇద్దరూ కెప్టెన్లుగా నియమించబడ్డ తరువాత అద్భుతమైన ఫామ్ తో చెలరేగిపోతున్నారు' అని రూట్ అన్నాడు.

అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారని ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించడాన్ని గర్వంగా భావిస్తున్నానని జో రూట్ అన్నాడు. 'టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన నేను కూడా వారినే అనుసరిస్తూ జట్టుకు విజయాలను అందించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా' అని చెప్పాడు.

England Test Captain Joe Root Aims to Emulate Virat Kohli, Steve Smith

కోహ్లీ, స్మిత్‌లు బ్యాటింగ్‌తో రాణిస్తూ వారి స్థాయిని పెంచుకోవడంతో పాటు వారి జట్లను కూడా తదుపరి స్థాయికి తీసుకుపోయారని కొనియాడాడు. ఈ క్రమంలో వారిలా తాను కూడా ఎందుకు చేయలేనని ప్రశ్నించుకున్నాడు. వారి అడుగుజాడల్లోనే నడుస్తానని జో రూట్ తన కెప్టెన్సీ బాధ్యతలపై మాట్లాడాడు.

తమ దేశంలో ఉన్న ప్రతీ కుర్రాడు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా చేయాలని కలలు కంటాడని, అది తన కెరీర్‌లో నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందని జో రూట్ పేర్కొన్నాడు. తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి కృషి చేస్తానని జో రూట్ తెలిపాడు.

ఇంగ్లాండ్ తరుపున 2012లో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన జో రూట్ అలెస్టర్ కుక్ కెప్టెన్సీలో 2015లో వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. 52.80 యావరేజితో 11 టెస్టు సెంచరీలు సాధించిన జో రూట్ ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో మూడో స్ధానంలో కొనసాగుతున్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+