Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

England Tour of Pakistan : 17 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ గడ్డ మీద అడుగుపెట్టనున్న ఇంగ్లాండ్..!

England Team will Going To Pakistan After 17Years For 7 T20Is and 3 Tests

ఇంగ్లాండ్ దాదాపుగా 17ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో పర్యటించబోతుంది. సెప్టెంబర్లో ఏడు టీ20ల సిరీస్ ఆడ్డానికి ఇంగ్లాండ్.. పాకిస్థాన్ గడ్డపై అడుగుమోపనుంది. ఆ తర్వాత డిసెంబరులో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కూడా పాకిస్థాన్లోనే ఇంగ్లాండ్ ఆడబోతుంది. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారిక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 20న కరాచీలో తొలి టీ20తో ఇంగ్లాండ్ పర్యటన ప్రారంభమవుతుంది. చివరి మూడు టీ20Iల కోసం లాహోర్‌కు వెళ్లే ముందు ఇరు జట్లు మొదటి నాలుగు మ్యాచ్‌లు ఇక్కడే ఆడతాయి.

కరాచీ, లాహోర్‌ రెండు వేదికల్లోనే ఏడు టీ20లకు ఇంగ్లాండ్‌కు పాక్ ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయమై అంతర్జాతీయ క్రికెట్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ జకీర్ ఖాన్ ఓ ప్రకటన రిలీజ్ చేశాడు. 'ఇంగ్లాండ్‌కు ఆతిథ్యమివ్వబోతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. పాకిస్థాన్ గడ్డపై అంతర్జాతీయ క్రికెట్లో ఓ బిజీ మరియు వినోదభరితమైన షెడ్యూల్‌గా ఉంటుంది' అని జకీర్ ఖాన్ చెప్పాడు.

'ఇంగ్లాండ్ అగ్రశ్రేణి టీ20జట్లలో ఒకటి. ICC టీ20 ప్రపంచ‌కప్‌కు ముందు ఆ జట్టు మా దేశంలో టీ20 సిరీస్ ఆడడం వల్ల మా జట్టు నిర్వహణకు, మా సన్నాహాలను మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది.' అని జకీర్ ఖాన్ చెప్పాడు. గతేడాది భద్రతా కారణాలతో న్యూజిలాండ్ జట్టు పాక్ పర్యటనను రద్దు చేసుకున్న వెంటనే ఇంగ్లాండ్ కూడా గతేడాది పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.

2022లో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లనున్న ఇంగ్లాండ్ పూర్తి షెడ్యూల్ ఇదే:
1వ టీ20: సెప్టెంబర్ 20, కరాచీ
2వ టీ20: సెప్టెంబర్ 22, కరాచీ
3వ టీ20: సెప్టెంబర్ 23, కరాచీ
4వ టీ20: సెప్టెంబర్ 25, కరాచీ
5వ టీ20: సెప్టెంబర్ 28, లాహోర్
6వ టీ20: సెప్టెంబర్ 30, లాహోర్
7వ T20I: అక్టోబర్ 2, లాహోర్

Story first published: Friday, August 5, 2022, 20:29 [IST]
Other articles published on Aug 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+