Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

England Tour of Pakistan: 17ఏళ్లకు పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లాండ్ టీం.. టీ20సిరీస్ షెడ్యూల్..!

England Team Reached Pakistan for 7Matches T20 Series After 17Years

ఇంగ్లాండ్ టీం దాదాపుగా 17ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌ గడ్డపై అడుగుమోపింది. ఏడు టీ20ల సిరీస్ ఆడ్డానికి ఇంగ్లాండ్ జట్టు పాకిస్థాన్ పర్యటనకు వచ్చింది. ఆ తర్వాత డిసెంబరులో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కూడా పాకిస్థాన్లోనే ఇంగ్లాండ్ ఆడబోతుంది. ఈ మేరకు సెప్టెంబర్ 20 నుంచి కరాచీ వేదికగా ప్రారంభం కానున్న టీ20 సిరీస్ కోసం ఇంగ్లాండ్ టీం కరాచీకి రీచ్ అయింది. ఇక వాళ్లు ఎయిర్ పోర్టు నుంచి హోటల్ రూంకు ప్రత్యేక బస్సుల్లో హై సెక్యూరిటీ నడుమ వచ్చారు. ఇక హోటల్ రూం వద్ద వారికి ఘన స్వాగతం లభించింది.

ఇకపోతే తొలి టీ20తో పాటు మొదటి నాలుగు టీ20లు కరాచీ వేదికగానే జరగనున్నాయి. చివరి మూడు టీ20Iలు లాహోర్‌ వేదికగా జరగుతాయి. సెక్యూరిటీ సమస్యలు తలెత్తకుండా కరాచీ, లాహోర్‌ రెండు వేదికల్లోనే ఏడు టీ20లకు ఇంగ్లాండ్‌కు పాక్ ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయమై అంతర్జాతీయ క్రికెట్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ జకీర్ ఖాన్ ఓ ప్రకటన రిలీజ్ చేశాడు. 'ఇంగ్లాండ్‌కు ఆతిథ్యమివ్వబోతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. పాకిస్థాన్ గడ్డపై అంతర్జాతీయ క్రికెట్లో ఓ బిజీ మరియు వినోదభరితమైన షెడ్యూల్‌గా ఉంటుంది' అని జకీర్ ఖాన్ చెప్పాడు.

పాకిస్థాన్ వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 పూర్తి షెడ్యూల్ ఇదే:
1వ టీ20: సెప్టెంబర్ 20, కరాచీ
2వ టీ20: సెప్టెంబర్ 22, కరాచీ
3వ టీ20: సెప్టెంబర్ 23, కరాచీ
4వ టీ20: సెప్టెంబర్ 25, కరాచీ
5వ టీ20: సెప్టెంబర్ 28, లాహోర్
6వ టీ20: సెప్టెంబర్ 30, లాహోర్
7వ T20I: అక్టోబర్ 2, లాహోర్

Story first published: Thursday, September 15, 2022, 15:31 [IST]
Other articles published on Sep 15, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+