England Squad for 5th Test Against India : ఇండియాతో బరిలోకి దిగబోయే ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు ఇదే..!

జులై 1నుంచి బర్మింగ్‌హామ్‌లో భారత్‌తో జరగబోయే అయిదో టెస్టు కోసం ఇంగ్లాండ్ టీం మేనేజ్ మెంట్ తమ జట్టును ప్రకటించింది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్‌ను వైట్‌వాష్ చేసిన జట్టుపైనే సెలక్టర్లు పూర్తి నమ్మకం ఉంచినట్లు కన్పించింది. ఇకపోతే చివరి టెస్ట్ మ్యాచ్‌లో చివరి రోజు కేవలం 44 బంతుల్లో 71* పరుగులు చేసిన జానీ బెయిర్ స్టో మ్యాచ్‌ను వన్ సైడ్ చేశాడు. అతనికి తోడు జో రూట్, ఆలీ పోప్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 296పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఉఫ్‌మని ఊదేసింది. ఇక ఈ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా 10వికెట్లు తీసిన జాక్ లీచ్ నిలవగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు జోరూట్, డారిల్ మిచెల్ ఇద్దరిని వరించింది.

బెన్ ఫోక్స్ ఒకవేళ రికవరీ కాకుంటే..
మూడో టెస్ట్‌లో కరోనా బారిన పడిన బెన్ ఫోక్స్‌కు ప్రత్యామ్నాయంగా సామ్ బిల్లింగ్స్ వికెట్ కీపర్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. చివరి టెస్టులో ఆడిన అతను జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగాడు. అలాగే బెన్ ఫోక్స్ సైతం జట్టులో ఎంపికయ్యాడు. ఇకపోతే భారత్‌తో టెస్టు మ్యాచ్ టైంకి ఫోక్స్ రికవరీ అవతాడా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. అతని ఐదు రోజుల ఐసోలేషన్ టెస్ట్ ప్రారంభమయ్యే ఒక రోజు ముందు మాత్రమే ముగుస్తుంది. అతడిని నేరుగా ప్లేయింగ్ 11లో ఆడించడం డౌటే. కేవలం ఇప్పటివరకు రెండు టెస్టులు మాత్రమే ఆడిన బిల్లింగ్స్‌ను ఇంగ్లాండ్ తీసుకోవచ్చు.

అతనికి ఇదే చివరి అవకాశం
ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మీద అద్భుతమైన సిరీస్ విజయం సాధించినప్పటికీ.. ఆ జట్టు ఓపెనర్ జాక్ క్రాలీ మాత్ర ఈ సిరీస్లో పూర్తిగా విఫలమయ్యాడు. అతని ఫామ్‌పై జట్టు మేనేజ్‌మెంట్ ఆందోళన చెందుతుంది. అతను ఈ సిరీస్‌లో 14.50సగటుతో 87పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయినప్పటికీ సెలక్టర్లు అతని మీద నమ్మకముంచి ఇండియాతో 5వ టెస్టుకు ఎంపిక చేశారు. ఇక ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి క్రాలీకి ఇదే చివరి అవకాశం అవ్వొచ్చు.

తుది జట్టులో జేమ్స్ అండర్సన్ Or జేమీ ఓవర్టన్
ఇకపోతే సీనియర్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముంది. దీంతో భారత్‌తో జరిగే టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఒక్క మార్పుతో బరిలోకి దిగే అవకాశముంది. ఇక అతను స్వల్ప గాయం కారణంగా మూడో టెస్ట్‌కు దూరమయ్యాడు. ఇండియాతో సిరీస్ సమం చేయాల్సిన కీలకమైన టెస్ట్ గేమ్‌కు అతను పూర్తిగా ఫిట్‌గా ఉంటాడని భావిస్తున్నారు. ఒకవేళ అండర్సన్ ఫిట్‌గా లేకపోతే జేమీ ఓవర్టన్ లాంటి ప్రత్యామ్నాయం ఇంగ్లాండ్‌కు ఉంది. చివరి మ్యాచ్‌లో ఓవర్టన్ బౌలింగ్లో రెండు వికెట్లు తీయడంతో పాటు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 55పరుగులకే 6వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు వచ్చి 97పరుగులు చేశాడు. ఇక మాథ్యూ పాట్స్, స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే.
భారత్‌తో జరిగే 5వ టెస్టుకు ఇంగ్లాండ్ జట్టు:
బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ ఫోక్స్, జాక్ లీచ్, అలెక్స్ లీస్, క్రెయిగ్ ఓవర్‌టన్, జామీ ఓవర్‌టన్, మాథ్యూ పాట్స్, ఆలీ పోప్, జో రూట్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications