ఇంగ్లాండ్ బ్యాటింగ్ కోచ్‌గా శ్రీలంక క్రికెట్ లెజెండ్..!
లండన్: శ్రీలంక క్రికెట్ లెజెండ్ మహిళా జయవర్దనే సేవలను ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వినియోగించుకునేందుకు ముందుకొచ్చింది. ఈ సందర్భంలో మహిళా జయవర్దనేను ఇంగ్లాండ్ జట్టుకు బ్యాటింగ్ సలహాదారుగా నియమించాలని ఈసీబీ నిర్ణయించింది.
ఈ విషయమై ఈసీబీ అతడితో చర్చించింది. త్వరలో ఇంగ్లాండ్ జట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పాకిస్ధాన్‌తో టెస్టు సిరిస్ ఆడనుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్, భారత్‌లోనూ ఇంగ్లాండ్ జట్టు పర్యటించనుంది. అనంతరం శ్రీలంక, పాకిస్థాన్ దేశాలతో సొంతగడ్డపై టెస్టు సిరిస్, వన్డే సిరిస్‌లను అడుతుంది.

2016లో భారత్‌లో జరగనున్న వరల్డ్ ట్వంటీ20 టోర్నమెంట్‌లో పాల్గొంటుంది. 18 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌కు మహిలా జయవర్దనే సేవలందించాడు. 2016లో ఉపఖండం జట్లతోనే ఇంగ్లాండ్ ఎక్కువగా ఆడాల్సి ఉండటంతో ఆయా జట్లు, పిచ్‌లపై చక్కటి అవగాహాన ఉన్న మహిళా జయవర్దనేను బ్యాటింగ్ సలహాదారుగా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఇంగ్లాండ్ హెచ్ కోచ్‌గా ఉన్న ట్రెవర్ బేలిస్, అసిస్టెంట్ కోచ్ పాల్ ఫార్ బ్రేస్‌లతో జయవర్దనేకు మంచి సాన్నిహిత్యం ఉంది. వీరిద్దరూ లంక జట్టుకు సేవలందించిన సమయంలో మహిళా జయవర్దనే జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.38 ఏళ్ల మహిళా జయవర్దనే అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టుల్లో 11, 814 పరుగులు చేయగా, వన్డేల్లో 12,650 పరుగులు సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications