ఆస్ట్రేలియాను ఊచకోత: 481 పరుగులతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఇంగ్లాండ్


హైదరాబాద్: వన్డే సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన ఆస్ట్రేలియాకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ పర్యటనలో ఆస్ట్రేలియా జట్టుపై ఆద్యంతం ఇంగ్లాండ్ తన ప్రదర్శన కనబరుస్తోంది. ఐదు వన్డేల సిరీస్‌లో తొలి రెండు వన్డేలను గెలుచుకున్న ఇంగ్లాండ్, మంగళవారం జరిగిన మూడో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.

నాటింగ్‌హామ్ వేదికగా జరిగి మూడో వన్డేలో మోర్గాన్ సేన వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మంగళవారం జరిగిన డే-నైట్ వన్డేలో ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 481 పరుగులు చేసింది. ఫలితంగా 2016లో పాకిస్థాన్‌పై చేసిన 444 పరుగుల రికార్డును ఇంగ్లాండ్ తానే బద్దలు కొట్టింది.

ఒకానొక దశలో 500 పరుగుల మైలురాయిని
ఒకానొక దశలో 500 పరుగుల మైలురాయిని చేరుకుంటుందని భావించినా చివర్లో వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో 481 పరుగులతోనే సరిపెట్టుకుంది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లలో అలెక్స్ హేల్స్ (92 బంతుల్లో 147; 16 ఫోర్లు, 5 సిక్సర్లు), జాన్ బెయిర్‌స్టో (92 బంతుల్లో 139; 15 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీలు నమోదు చేశారు.

జేసన్ రాయ్ మెరుపు ఇన్నింగ్స్
జేసన్ రాయ్ (61 బంతుల్లో 82; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇయాన్ మోర్గాన్ (30 బంతుల్లో 67; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్ భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించారు. మ్యాచ్‌లో మూడు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో మూడు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు కావడం విశేషం.

టై అత్యధికంగా 100 పరుగులు
ఇంగ్లాండ్ ధాటికి ఆసీస్ బౌలర్లలో టై అత్యధికంగా 100 పరుగులు సమర్పించుకోగా, రిచర్డ్సన్ 92, స్టొయినిస్ 85 పరుగులు ఇచ్చారు. అనంతరం 482 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రషిద్ (4/47) దెబ్బకు 239 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 242 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది.

అలెక్స్ హేల్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు
ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో ట్రావిస్ హెడ్ (51), స్టోయినీస్ (44)లు టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లు తీయగా.... ప్లంకెట్ మూడు, డేవిడ్ విల్లీ రెండు వికెట్లు తీశారు. ఆసీస్ ఆటగాళ్లలో ట్రావిస్ హెడ్ 51, మార్కస్ స్టోయిన్స్ 44 పరుగులు చేశారు. అలెక్స్ హేల్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications