For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఇంగ్లాండ్‌లో స్టోక్స్ ఉన్నా లేకున్నా యాషెస్ సిరిస్ ఆసీస్‌దే'

ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ జట్టులో ఉన్నా లేకున్నా యాషెస్ సిరిస్‌లో ఆస్ట్రేలియానే గెలుస్తుందని ఆ దేశ మాజీ క్రికెటర్ గ్రేగ్ బ్లేవేట్ అభిప్రాయపడ్డాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ జట్టులో ఉన్నా లేకున్నా యాషెస్ సిరిస్‌లో ఆస్ట్రేలియానే గెలుస్తుందని ఆ దేశ మాజీ క్రికెటర్ గ్రేగ్ బ్లేవేట్ అభిప్రాయపడ్డాడు. గత ఆదివారం బ్రిస్టల్‌లోని నైట్ క్లబ్‌ వద్ద ఓ వ్యక్తితో గొడవపడిన బెన్‌స్టోక్స్‌ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు తాత్కాలికంగా జట్టు నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

నైట్ క్లబ్ బయట సదరు వ్యక్తిని స్టోక్స్ చితకబాదుతున్న వీడియోని గురువారం బ్రిటిష్ పత్రిక సన్ న్యూస్ విడుదల చేసింది. అందులో స్టోక్స్ నిమిషంలో పదిహేను పంచ్‌లు విసిరాడు. అందులో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు ఈ ఘర్షణలో స్టోక్స్‌ చేతికి గాయం కూడా అయింది.

England Set to Lose Ashes, With or Without Stokes, Says Blewett

ఈ సాక్ష్యం కారణంగా పోలీస్‌ విచారణలో కూడా స్టోక్స్‌‌‌‌కి తప్పక శిక్ష పడే అవకాశం ఉన్నందున అతను నవంబరులో ఆస్ట్రేలియాతో జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌కి అందుబాటులో ఉండకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఆ వీడియోని చూసిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) బెన్‌ స్టోక్స్‌పై కఠిన నిర్ణయం తీసుకుంది.

ఈ కేసులో పోలీసుల విచారణను ఎదుర్కొంటున్న స్టోక్స్.. నిర్దోషిగా రుజువయ్యేంత వరకు అతన్ని జాతీయ జట్టు నుంచి సస్పెండ్ చేస్తూ ఈసీబీ నిర్ణయం తీసుకుంది. స్టోక్స్‌తో పాటు ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న అలెక్స్‌ హేల్స్‌కు కూడా ఈ సస్పెన్షన్‌ వర్తిస్తుందని ఈసీబీ ప్రకటించింది.

England Set to Lose Ashes, With or Without Stokes, Says Blewett


ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఇంగ్లాండ్ జట్టుకి ఆల్‌రౌండర్‌గా అద్వితీయమైన విజయాలు అందించిన బెన్‌స్టోక్స్.. యాషెస్ సిరీస్ ఆడలేకపోతే ఆ జట్టుకి విజయావకాశాలు సన్నగిల్లుతాయని ఆ దేశ మాజీ క్రికెటర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రేగ్ బ్లేవేట్ పై విధంగా స్పందించాడు.

'సొంతగడ్డపై జరిగే ఈ యాషెస్ సిరీస్‌లో ప్రత్యర్థిపై ఆస్ట్రేలియా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తుందని నా గట్టి నమ్మకం. ఇంగ్లాండ్ జట్టులో బెన్‌స్టోక్స్ ఉన్నా.. లేకపోయినా.. ఫలితం మాత్రం మారబోదు. కాకపోతే, బెన్‌స్టోక్స్ జట్టులో ఉంటే బాగుంటుందని ఇంగ్లాండ్ ఆశిస్తుంటుంది' అని బ్లేవేట్ పేర్కొన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+