Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈ ఏడాది ఇంగ్లండ్ చెత్త రికార్డులు.. 54 డ‌కౌట్లు, 14 సార్లు 200లోపే ఆలౌట్

England set 3 worst records in 2021

యాషెస్ సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్ వేదిక‌గా జ‌రిగిన‌ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో ఘోర ప‌రాజ‌యం పాలైన‌ ఇంగ్లండ్ 2021 సంవ‌త్స‌రంలో ప‌లు చెత్త రికార్డుల‌ను త‌మ పేరు మీద లిఖించుకుంది. మూడో టెస్ట్ మ్యాచ్ ఓట‌మితో సిరీస్ కూడా కోల్పోయిన రూట్ సేన ఈ ఏడాదిని నిరాశ‌జ‌న‌కంగా ముగించింది. నిజానికి టెస్ట్ క్రికెట్‌లో 2021 సంవ‌త్స‌రం ఇంగ్లండ్‌కు పెద‌గా క‌లిసిరాలేదు. ఈ సంవ‌త్స‌రం ఇంటా, బ‌య‌ట ఆడిన మ్యాచ్‌ల్లో అత్య‌ధికంగా ఆ జ‌ట్టు ఓట‌మి పాలైంది. అంతేకాకుండా టెస్టు క్రికెట్‌లో మూడు అత్యంత చెత్త రికార్డులను సృష్టించింది.

ఈ ఏడాది ఇంగ్లండ్ ఖాతాలో 54 డ‌కౌట్లు

2021 సంవ‌త్స‌రం అంతా బ్యాటింగ్ స‌మ‌స్యల‌తో ఇబ్బంది ప‌డిన ఇంగ్లండ్ జ‌ట్టు ఓ చెత్త రికార్డును న‌మోదు చేసింది. టీమ్‌లో స్టార్ బ్యాట‌ర్లు ఉన్న‌ప్ప‌టికీ కెప్టెన్ రూట్ మిన‌హా ఈ సారి ఎవ‌రూ పెద‌గా రాణించ‌లేక‌పోయారు. దీంతో ఎక్కువ‌గా డ‌కౌట్లు అయ్యారు. త‌ద్వారా 2021 సంవ‌త్స‌రంలో ఎక్కువ మంది డ‌కౌట్లు అయినా జట్టుగా ఇంగ్లండ్ చెత్తు రికార్డును న‌మోదు చేసింది.

ఈ ఏడాది ఇంగ్లీష్ జ‌ట్టులోని ఆట‌గాళ్లు రికార్డు స్థాయిలో 54 సార్లు డ‌కౌట్ అయ్యారు. అంతేకాకుండా మొత్తంగా ఒక సంవ‌త్సరంలో టెస్ట్ క్రికెట్‌లో అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయినా ఆట‌గాళ్ల జాబితాలో ఇంగ్లండ్ ఆట‌గాళ్లు మొద‌టి స్థానంలో నిలిచారు. ఇంగ్లండ్ త‌ర్వాతి స్థానంలో టీమిండ‌యానే ఉంది. ఈ ఏడాది టీమిండియా ఆట‌గాళ్లు 34 సార్లు డ‌కౌట్ అయ్యారు. ఇక మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో జింబాబ్వే, బంగ్లాదేశ్‌, వెస్టిండీస్ ఉన్నాయి. ఈ జ‌ట్లలోని ఆట‌గాళ్లు 23 సార్ల చొప్పున డ‌కౌట్ అయ్యారు.

14 సార్లు 200 లోపే అలౌట్‌

ఈ ఏడాది ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్‌లో అత్య‌ధిక సార్లు 200 లోపు ఆలౌటైన జ‌ట్టుగా చెత్త రికార్డును మూట‌గ‌ట్టుకుంది. ఈ సంవ‌త్స‌రంలో ఇంగ్లండ్ జ‌ట్టు ఏకంగా 14 సార్లు 200లోపు ఆలౌలైంది. ఈ ఏడాది ఆడిన‌ 29 ఇన్నింగ్స్‌ల్లో ఆ జ‌ట్టు స‌గం ఇన్నింగ్స్‌ల్లో 200 ప‌రుగులు కూడా చేయ‌లేక‌పోయింది.

ఇందులో అత్య‌ధికంగా 8 సార్లు ఇండియా చేతిలోనే 200 లోపు ఆలౌటైంది. ఆ త‌ర్వాత ఆస్ట్రేలియా చేతిలో 5 సార్లు 200లోపు ఆలౌటైంది. న్యూజిలాండ్ చేతిలో ఒక సారి ఆలౌటైంది. ఇందులో రెండు సార్లు100 ప‌రుగుల లోపే ఆలౌటైంది. ఓ సారి ఇండియా చేతిలో, మ‌రోసారి ఆస్ట్రేలియా చేతిలో 100 ప‌రుగుల లోపు ఆలౌటైంది.

ఎక్స్‌ట్రాల‌ రూపంలోనే 412 ప‌రుగులు

ఈ ఏడాది ఇంగ్లండ్ కీల‌క బ్యాట‌ర్లు చేసిన ప‌రుగుల కంటే ఎక్స్‌ట్రాల రూపంలోనే ఆ జ‌ట్టుకు ఎక్కువ ప‌రుగులు వ‌చ్చాయి. ఈ ఏడాది ఎక్కువ ప‌రుగులు చేసిన ఇంగ్లండ్ బ్యాట‌ర్ల జాబితాను ప‌రిశీలిస్తే ఎక్స్‌ట్రాల రూపంలో వ‌చ్చిన 412 ప‌రుగులు మూడో స్థానంలో ఉండ‌డం గ‌మనార్హం. ఆ జ‌ట్టు స్టార్ బ్యాట‌ర్లు జానీ బెయిర్‌స్టో, ఓలీ పోప్ చేసిన ప‌రుగుల కంటే ఇవి ఎక్కువ‌. ఈ ఏడాది ఇంగ్లండ్ త‌రఫున అత్య‌ధికంగా ఆ జ‌ట్టు కెప్టెన్ జో రూట్ 1708 ప‌రుగులు చేశాడు.

మొత్తంగా ఈ ఏడాది టెస్టు క్రికెట్‌లో ఒక బ్యాట‌ర్ అత్య‌ధికంగా చేసిన ప‌రుగులు కూడా ఇవే. ఆ త‌ర్వాత ఇంగ్లండ్ త‌ర‌ఫున రోరి బ‌ర్న్స్ 530 పరుగుల‌తో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ త‌ర్వాత మూడో స్థానంలో ఇంగ్లండ్‌కు ఎక్స్‌ట్రాల రూపంలో వ‌చ్చిన పరుగులే ఉన్నాయి. ఇంగ్లండ్‌కు ఈ ఏడాది ఎక్స్‌ట్రాల రూపంలో 412 ప‌రుగులు వ‌చ్చాయి. ఇక నాలుగో స్థానంలో 391 ప‌రుగుల‌తో జానీ బెయిర్‌స్టో, ఐదో స్థానంలో 368 ప‌రుగుల‌తో ఓలీ పోప్ ఉన్నారు.

Story first published: Tuesday, December 28, 2021, 10:08 [IST]
Other articles published on Dec 28, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+