కోచ్ కుంబ్లే ఎటువైపు: ఆ ఇద్దరిలో ఎవరు?
బెంగుళూరు: ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన టెస్టు, వన్డే సిరిస్‌లను కైవసం చేసుకుని మంచి జోరుమీదున్న టీమిండియా ఇక ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరిస్‌కు సిద్ధమైంది. నవంబర్ 9న రాజ్ కోట్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. తొలి టెస్టుకు తుది జట్టు ఎలా ఉండబోతుందా? అన్న సందిగ్ధత నెలకొంది.
ముఖ్యంగా ఆరో స్ధానం కోసం గట్టి పోటీ నెలకొంది. అంతేకాదు ఆరో స్ధానంలో బ్యాట్ మెన్‌ను ఆడించాలా? లేక ఆల్‌రౌండర్‌కు చోటివ్వాలా అనే దానిపై టీమిండియాలో సందిగ్ధత నెలకొంది. ఈ స్ధానం కోసం కరుణ్ నాయర్, హార్దిక్ పాండ్యా పోటీ పడుతున్నారు. న్యూజిలాండ్ సిరీస్‌లో తుది జట్టు కూర్పులో ఎటువంటి ఇబ్బంది రాలేదు.

రోహిత్ శర్మకు గాయం: కరుణ్ నాయర్‌కు చోటు
ఎందుకంటే ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఉన్నాడు కాబట్టి. అయితే గాయంతో అతను ఇంగ్లాండ్ సిరీస్‌కు దూరం కావడంతో కరుణ్ నాయర్‌కు జట్టులో చోటు దక్కింది. మరోవైపు న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో సత్తా చాటిన ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కూడా తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకుని నాయర్‌కు గట్టి పోటీ ఇస్తున్నాడు.

పాండ్యా, నాయర్ ఇద్దరూ నైపుణ్యం ఉన్న ఆటగాళ్లే
ఈ క్రమంలో తొలిసారి టెస్టు జట్టులో చోటు సంపాదించిన హార్దిక్ పాండ్యాతో పాటు కరణ్ నాయర్‌లు నైపుణ్యం ఉన్న ఆటగాళ్లని భారత జట్టు చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే కితాబిచ్చాడు. ఆదివారం కుంబ్లే మీడియాతో మాట్లాడాడు. హార్దిక్ అద్భుతమైన ఆల్‌రౌండర్. ఐపీఎల్‌లో ఆడిన తొలిసారే తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.

ఎవరిని తీసుకోవాలన్న దానిపై స్పందించని కుంబ్లే
అయితే తొలి టెస్టు కోసం ఇద్దరిలో ఎవరిని తీసుకోవాలన్న అంశంపై మాత్రం స్పందించలేదు. వన్డే ఫార్మెట్‌కు టెస్టు ఫార్మెట్‌కు చాలా తేడా ఉంటుంది. కానీ పాండ్యాల్లో ఉన్న నైపుణ్యాన్ని మేం గుర్తించాం. టీ20ల్లో మెరుపులు, ధర్మశాలలో 3 వికెట్లు, ఢిల్లీలో 30కి పైగా పరుగులు.. వీటన్నింటితోనే అతను టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు.

ఐదో బౌలర్ అవసరం ఉంది
ప్రస్తుతం జట్టులో ఐదో బౌలర్ అవసరం చాలా ఉంది. 140 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయడం, లోయర్ ఆర్డర్‌లో బాగా బ్యాటింగ్ చేయగల ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే కచ్చితంగా మేం పాండ్యా వైపే చూస్తాం. తుది జట్టులో అతని చోటు దక్కితే స్వేచ్ఛగా ఆడే వెసులుబాటు కల్పిస్తాం. మంచి ఆటగాడికి మద్దతు ఇవ్వడం చాలా అవసరం అని కుంబ్లే పేర్కొన్నాడు.

రంజీ క్రికెట్‌లో కరుణ్ నాయర్ అద్భుతంగా రాణించాడు
మరోవైపు ఆరో బ్యాట్స్‌మన్‌గా కరుణ్ నాయర్ తీసుకోవడంపై కూడా కుంబ్లే సానుకూలంగానే స్పందించాడు. రంజీ క్రికెట్‌లో కరుణ్ నాయర్ అద్భుతంగా రాణించాడని ప్రశంసలు కురిపించాడు. నిలకడగా భారీ స్కోర్లు చేశాడని గుర్తు చేశాడు. అయితే భారత్-ఏ జట్టు తరఫున ఆసీస్ టూర్‌లో నాయర్‌పై విమర్శలు వచ్చినా తాము మాత్రం అతని నిలకడనే ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications