'బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌' గా వరల్డ్‌కప్ హీరో బెన్ స్టోక్స్‌

హైదరాబాద్: ఇంగ్లాండ్ వరల్డ్‌కప్ హీరో బెన్‌ స్టోక్స్‌కు అరుదైన గౌరవం లభించింది. 2019 సంవత్సరానికి గాను 'బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డుకు బెన్ స్టోక్స్‌ ఎంపికయ్యాడు. ఫలితంగా ఈ అవార్డు అందుకున్న ఐదో క్రికెటర్‌గా బెన్ స్టోక్స్ అరుదైన ఘనత సాధించాడు.

బెన్ స్టోక్స్‌కు ముందు జిమ్‌ లేకర్ (1956), డేవిడ్‌ స్టీలే (1975), ఇయాన్‌ బోథమ్‌ (1981), ఆండ్రూ ఫ్లింటాఫ్‌ (2005)లు ఈ అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు. ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని బెన్ స్టోక్స్ అన్నాడు. లార్డ్స్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్‌ విజయం సాధించడంలో బెన్ స్టోక్స్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

T20 World Cup: దక్షిణాఫ్రికా తరుపున ఏబీ డివిలియర్స్, కొత్త కోచ్ బౌచర్ ఇలా!

ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఇంగ్లాండ్‌ జట్టు 'టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్'గా కూడా ఎంపికైంది. ఫైనల్లో మార్టిన్‌ గప్తిల్‌ రనౌట్‌ 'మూమెంట్ ఆఫ్‌ ది ఇయర్‌'గా నిలిచింది. ఇదిలా ఉంటే, ఈ అవార్డు రేసులో ఫార్ములావన్ ప్రపంచ ఛాంపియన్‌ హామిల్టన్‌ రెండో స్థానంలో నిలిచాడు.

నేచురల్‌ గేమ్‌ అంటూ ఏమీ లేదు.. పరిస్థితులకు తగ్గట్టు ఆడటమే ముఖ్యం: పంత్

బీబీసీ స్పోర్ట్స్ అవార్డులు అందుకున్న ఆటగాళ్లు:

హెలెన్ రోలాసన్ అవార్డు: డాడీ వీర్

యంగ్ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్: కరోలిన్ డుబోయిస్

లైఫ్‌టైమ్ అచీవ్మెంట్: తన్నీ గ్రే-థాంప్సన్

కోచ్ ఆఫ్ ది ఇయర్: జాన్ బ్లాకీ

టీం ఆఫ్ ది ఇయర్: ఇంగ్లాండ్

వరల్డ్ స్పోర్ట్ స్టార్: ఎలియుడ్ కిప్‌చోజ్

గ్రేటేస్ట్ స్పోర్టింగ్ మూమెంట్: ఇంగ్లాండ్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపడం కోసం జోస్ బట్లర్ స్టంప్స్‌ను గిరాటేయడం

గుర్తించబడని హీరో: కీరెన్ థాంప్సన్

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, December 16, 2019, 16:02 [IST]
Other articles published on Dec 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X