న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వాళ్లవన్నీ ఉత్తమాటలే.. కెప్టెన్సీ ఎంజాయ్ చేశా: బెన్ స్టోక్స్

Englands stand-in skipper Ben Stokes Says Captaincy Didnt Change Me As A Player

సౌతాంప్టన్: సారథ్యంతో తాను ఒత్తిడికి గురైనట్లు విమర్శకులు చేసిన విమర్శలన్నీ ఉత్త మాటలేనని, ఇంగ్లండ్ టీమ్ కెప్టెన్సీని బాగా ఎంజాయ్ చేశానని ఆ జట్టు ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తెలిపాడు. తన ఆటపై కెప్టెన్సీ ఎలాంటి ప్రభావం చూపలేదన్నాడు. ఇక రెగ్యూలర్ కెప్టెన్ జోరూట్ అందుబాటులో లేకపోవడంతో... వెస్టిండీస్‌తో ఆదివారం ముగిసిన తొలి టెస్ట్‌లో స్టోక్స్ సారథిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడిపోవడంతో స్టోక్స్‌పై విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన స్టోక్స్.. విమర్శకులపై మండిపడ్డాడు.

ఎదో ఒకటి మాట్లాడాలి..

ఎదో ఒకటి మాట్లాడాలి..

‘కెప్టెన్సీ వల్ల నా ఆట దెబ్బతినలేదు. చూడటానికి అలా అనిపించి ఉండొచ్చు. విమర్శకులు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి నాపై విమర్శలు గుప్పిస్తున్నారు. రూట్ అందుబాటులో లేకపోవడంతో నాకు సారథ్యం వహించే అవకాశం లభించింది. ఒక్క మ్యాచ్‌కే నాపై ఒత్తిడి ఉంటుందనడం సరికాదు. నిజానికి సారథ్యం కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నా. అనుకోకుండా వచ్చిన ఈ అవకాశాన్ని బాగా ఆస్వాదించా.

నా ఆట ఏం మారలేదు..

నా ఆట ఏం మారలేదు..

ఫీల్డ్‌లో నిర్ణయాలు తీసుకోవడం చాలా బాగా అనిపించింది. చేతిలో బాల్ ఉన్నప్పుడు ఇది వరకు ఎలా ఆలోచించేవాడినో ఇప్పుడు కూడా అలాగే ఆలోచించా. బ్యాటింగైనా, బౌలింగైనా నా ఆట తీరులో ఎలాంటి మార్పు ఉండదు'అని స్టోక్స్ చెప్పుకొచ్చాడు. మరోవైపు తొలి టెస్ట్‌లో పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌ను తీసుకోకపోవడాన్ని స్టోక్స్ సమర్ధించుకున్నాడు. పరిస్థితులను బట్టే ఎంపిక ఉంటుందని, తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశాడు.

విండీస్ సూపర్ గేమ్..

విండీస్ సూపర్ గేమ్..

117 రోజుల సుదీర్ఘ విరామం అనంతరం జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం దోబూచులాడిన ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 204 రన్స్‌కే ఆలౌటైంది. వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ 6, షెనన్ గాబ్రియేల్ 4 వికెట్లతో ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించారు. అనంతరం వెస్టిండీస్‌ తమ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 318 పరుగులు చేసి 114 రన్స్ లీడ్ అందుకుంది.

 బ్లాక్ వుడ్ అదరహో..

బ్లాక్ వుడ్ అదరహో..

ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ రాణించడంతో 313 పరుగులకు ఆలౌటై.. విండీస్‌కు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. స్వల్ప లక్ష్యమే అయినా ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగడంతో వెస్టిండీస్ 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. బ్లాక్‌వుడ్‌ (95; 12 ఫోర్లు) అదరగొట్టడంతో.. 200 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. విండీస్ పేసర్ షెనాన్ గాబ్రియల్‌కు 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది.

ఎమ్మెస్కే వల్లే విహారీకి ఛాన్స్.. సెలక్షన్‌ సమావేశాలు లైవ్ ఇవ్వాలి: మనోజ్ తివారీ

Story first published: Tuesday, July 14, 2020, 8:39 [IST]
Other articles published on Jul 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X