ఐపీఎల్ 2019 వేలం: అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడు ఎవరో తెలుసా?


హైదరాబాద్: ఐపీఎల్ 2019 వేలంలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా ఇంగ్లాండ్‌కు చెందిన శామ్ కుర్రన్ నిలిచాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం నిర్వహించిన వేలంలో ప్రాంఛైజీలు యువ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించాయి. మంగళవారం జైపూర్ వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో జయదేవ్ ఉనాద్కత్, తమిళనాడు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కోట్లు పలికారు.

అత్యధిక ధర పలికిన విదేశీ క్రికెటర్‌గా కుర్రన్
విదేశీ ఆటగాళ్లలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ శామ్ కుర్రన్ అత్యధిక ధర పలకగా, ఆ తర్వాతి స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన కొలిన్ ఇంగ్రామ్ నిలిచాడు. ఈ ఏడాది భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అందుకున్న కుర్రన్‌ను పోటీ పడిమరీ రూ. 7.2 కోట్లకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కొనుగోలు చేసింది.

రూ. 6.40 కోట్లకు కొలిన్ ఇంగ్రామ్‌ను
ఆ తర్వాత దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ కొలిన్ ఇంగ్రామ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 6.40 కోట్లకు సొంతం చేసుకుంది. విండీస్ క్రికెటర్లు బ్రాత్‌వైట్ (రూ. 5 కోట్లు), హెట్‌మెయిర్ (రూ. 4.2 కోట్లు), నికోలస్ పూరన్ (రూ. 4.2కోట్లు)లకు ప్రాంఛైజీలు సొంతం చేసుకున్నాయి. కార్లోస్ బ్రాత్‌వైట్ (రూ.5 కోట్లు)పై కోల్‌కతా దూకుడుగా ముందుకెళ్లి చేజిక్కించుకుంది.

ఇంగ్లాండ్, ఆసీస్ ఆటగాళ్లపై ఆసక్తి కనబర్చని ప్రాంఛైజీలు
హెట్‌మెయిర్ కోసం కోల్‌కతా, రాజస్థాన్, ఢిల్లీ పోటీపడగా బెంగళూరు రూ.4.20 కోట్లకు తీసుకుంది. ఎలాంటి అంచనాలు లేని వికెట్ కీపర్ నికోలస్ పూరన్ (రూ.4.20 కోట్లు)ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అధిక ధర చెల్లించి సొంతం చేసుకుంది. ఏప్రిల్ 25 వరకే లీగ్‌కు అందుబాటులో ఉంటామని చెప్పడంతో ఇంగ్లాండ్, ఆసీస్ ఆటగాళ్లపై ప్రాంఛైజీలు ఆసక్తి కనబర్చలేదు.

వేలంలో 60 మంది అమ్ముడుపోయారు
మొత్తం 1003 మంది ప్లేయర్లు ఈ వేలానికి రిజిస్ట్రేషన్ చేసుకోగా, ప్రాంఛైజీల సూచన మేరకు 351 మంది తుది జాబితాకు ఎంపిక చేశారు. ఇందులో 228 మంది భారత ఆటగాళ్లున్నారు. 70 మంది క్రికెటర్లను ఎంపిక చేసుకునేందుకు 8 ఫ్రాంచైజీలు పోటీపడగా 60 మంది అమ్ముడుపోయారు. ఇందులో 40 మంది భారత్ నుంచి కాగా 20 విదేశీ ఆటగాళ్లున్నారు. వీళ్ల కోసం అన్ని ఫ్రాంచైజీలు కలిపి రూ. 106.8 కోట్లు ఖర్చు చేశాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications