Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెప్టెన్‌గా మెర్గాన్: వన్డే, టీ20 సిరిస్‌కు ఇంగ్లాండ్ జట్టు

హైదరాబాద్: వచ్చే నెలలో భారత్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరిస్‌కు ఇంగ్లాండ్ జట్టును మంగళవారం ఈసీబీ ప్రకటించింది. భారత్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరిస్‌కు ఇయాన్ మోర్గాన్‌ని తిరిగి జట్టులో ఎంపిక చేశారు. 15 మంది జట్టు సభ్యులతో కూడిన వన్డే జట్టు, టీ 20 కెప్టెన్‌గా మోర్గాన్ పేరును ఖరారు చేస్తూ ఈసీబీ నిర్ణయం తీసుకుంది.

బంగ్లాదేశ్ పర్యటనకు గాను ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు నుంచి తప్పుకున్న ఇయాన్ మోర్గాన్‌తో పాటు స్టార్ బ్యాట్స్‌మెన్ అలెక్స్ హాల్స్‌ను తిరిగి జట్టులో ఎంపిక చేశారు. బంగ్లాలో భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన మోర్గాన్ ఆ పర్యటనకు దూరంగా ఉన్నాడు. దీంతో కెప్టెన్సీ బాధ్యతలను జాస్ బట్లర్ అప్పగించారు.

భారత పర్యనటలో మోర్గాన్ జట్టుకు అందుబాటులోకి రావడంతో వన్డే, టీ20 కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడని ఈసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, బంగ్లా పర్యటనలో భాగంగా వన్డే సిరిస్ నుంచి విశ్రాంతి తీసుకున్న జో రూట్‌ను భారత్ తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు.

England's ODI, T20 squads against India announced; Morgan, Hales recalled

ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో జో రూట్ అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇంగ్లాండ్ ఆటగాళ్లు బెన్ డకెట్, స్టీవెన్ ఫిన్, జేమ్స్‌లను వన్డే, టీ20 సిరిస్‌లకు ఎంపిక చేయలేదు. గత 12 వన్డేల్లో తొమ్మిదింటిలో గెలిచిన ఇంగ్లాండ్ జట్టు అదే జోరుని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది.

జనవరి 15న పూణెలో జరగనున్న మ్యాచ్‌తో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య వన్డే సిరిస్ ప్రారంభం కానుంది. డిసెంబర్ 20తో ఇరు జట్ల మధ్య టెస్టు సిరిస్ ముగియనుంది. ఆ తర్వాత క్రిస్టమస్, న్యూఇయర్ వేడుకల కోసం ఇంగ్లాండ్ జట్టు తిరిగి స్వదేశం వెళ్లనుంది. మళ్లీ తిరిగి జనవరి 2017లో భారత్‌కు రానుంది.

వన్డే జట్టు:
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), ఆలీ, జోనాథన్ బెయిర్స్టో, జేక్ బాల్, సామ్ బిలింగ్స్, జోస్ బట్లర్, లియం డాసన్, అలెక్స్ హాలెస్, లియం ప్లున్కేట్, ఆదిల్ రషీద్, జో రూట్, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్

T20 జట్టు:
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), ఆలీ, జేక్ బాల్, సామ్ బిలింగ్స్, జోస్ బట్లర్, లియం డాసన్, అలెక్స్ హాలెస్, క్రిస్ జోర్డాన్, మిల్స్, లియం ప్లున్కేట్, ఆదిల్ రషీద్, జో రూట్, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, డేవిడ్ విల్లీ.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+