For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌తో ఆడే మ్యాచ్‌లో అండర్‌సన్‌కు విశ్రాంతి

Englands James Anderson out for six weeks to recover from shoulder injury

హైదరాబాద్: ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు.. భారత్‌తో ఆడనున్న టెస్టు మ్యాచ్‌లో మరింత బలంగా బరిలోకి దిగేందుకు మార్పులు చేస్తోంది. ఈ క్రమంలో బ్యాట్స్‌మెన్ కట్టడి చేసేందుకు బౌలింగ్ వనరులపై దృష్టి సారించింది. ఇప్పటినుంచే సన్నాహాక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఇప్పటికే కుడి భుజం నొప్పితో బాధపడుతున్న ఆ జట్టు ఫాస్ట్‌ బౌలర్‌ జేమ్స్ అండర్సన్‌కు ఆరువారాల పాటు విశ్రాంతినిచ్చినట్లు ప్రకటించింది.

'ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రాణించి ఆకట్టుకున్న అండర్సన్‌.. తాజాగా భుజం నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఉన్న నేపథ్యంలో అప్పటిలోగా అతను పూర్తిస్థాయిలో ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశంతో విశ్రాంతి ఇచ్చినట్లు' ఈసీబీ ఓ ప్రకటనలో తెలిపింది.

అంతర్జాతీయ మ్యాచ్‌లో రాణిస్తాడనే ఉద్దేశ్యంతో విశ్రాంతినిచ్చిన అండర్సన్ స్వదేశంలో జరగనున్న కౌంటీ ఛాంపియన్‌షిప్‌ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఇప్పటివరకూ 138టెస్టులాడిన ఈ కుడి చేతి వాటం బౌలర్‌ మొత్తం 540వికెట్లు పడగొట్టి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. గతంలోనూ భారత్‌ ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ఈ ఇంగ్లీష్‌ బౌలర్‌.. భారత బ్యాట్స్‌మెన్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు.

ఇదిలాఉండగా, జూలై3న ప్రారంభమయ్యే తొలి టీ20తో టీమిండియా ఇంగ్లాండ్‌ పర్యటన ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడిన అనంతరం.. ఆగస్టు 1నుంచి సెప్టెంబర్‌ 11వరకు మొత్తం ఐదు టెస్టులలో ఈ రెండు జట్లు తలపడతాయి. మరోవైపు ఇంగ్లాండ్‌ కంటే ముందే టీమిండియా ఐర్లాండ్‌తో రెండు టీ20లు ఆడనుంది.

Story first published: Monday, June 11, 2018, 13:19 [IST]
Other articles published on Jun 11, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+