న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నిన్న క్రికెట్ వరల్డ్‌కప్.. 1966లో పుట్‌బాల్ వరల్డ్‌కప్: ఇంగ్లాండ్ తొండితోనే గెలిచింది!

Englands first cricket WC victory is as controversial as its onlyfootball WC win in 1966

హైదరాబాద్: జులై 14న లార్డ్స్‌లో ఇంగ్లాండ్ ప్రపంచకప్ విజేతగా నిలిచింది. 1979 తర్వాత ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించి తొలిసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సైతం నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది.

బౌండరీల ఆధారంగా విజేత

బౌండరీల ఆధారంగా విజేత

ఈ సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. అనంతరం 16 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ సైతం ఆరు బంతుల్లో వికెట్ నష్టపోయి అదే 15 పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్ కూడా టై అయింది. చివరకు బౌండరీలు ఆధారంగా ఇంగ్లాండ్‌ను విశ్వవిజేతగా ప్రకటించారు. ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు ఓడిపోయినా... క్రికెట్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది.

1966 పుట్‌బాల్ ప్రపంచకప్‌లో సైతం

1966 పుట్‌బాల్ ప్రపంచకప్‌లో సైతం

కాగా, బౌండరీల ఆధారంగా మ్యాచ్‌ విజేతను నిర్ణయించడంపై అటు అభిమానులతో పాటు, ఇటు మాజీలు సైతం ఐసీసీని విమర్శిస్తున్నారు. అయితే, ఇంగ్లాండ్ ఇలా విమర్శలు పాలవడం ఇదే మొదటిసారి కాదు. 1966 పుట్‌బాల్ ప్రపంచకప్ విజేతగా నిలిచినప్పుడు పలు విమర్శలు ఆ జట్టుపై వచ్చాయి. ఆ పుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్‌గా బాబీ మూరే నాయకత్వం వహించాడు. ఈ ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్ విజయం సాధించి ఛాంపియన్‌గా అవతరించింది.

ఇంగ్లాండ్ జట్టుపై పక్షపాత ఆరోపణలు

ఇంగ్లాండ్ జట్టుపై పక్షపాత ఆరోపణలు

మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ జట్టుపై పక్షపాత ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ టోర్నీకి ముందు బాబీ మూరే మాట్లాడుతూ బ్రెజిల్ తరుపున పీలే ఆడడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో సాకర్‌లో బ్రెజిల్ జట్టంటే ప్రత్యర్ధి జట్లు హడలిపోయేవి. ఆ జట్టులో అత్యుత్తమ ఆటగాళ్లు ఉంటేవాళ్లు. అంతేకాదు అంతకముందు జరిగిన 1958, 1962 ఎడిషన్లలో బ్రెజిల్ విజేతగా నిలిచింది. 1966లో బ్రెజిల్ గెలిస్తే ఆ జట్టుకు హ్యాట్రిక్ అయ్యేది. అయితే, 1966లో యూరప్‌లో రాజకీయ కారణాల దృష్ట్యా ఇంగ్లాండ్‌ పుట్‌బాల్ వరల్డ్‌కప్ నెగ్గాల్సిన పరిస్థితి తలెత్తింది.

పీలేను కావాలనే తప్పించారు

పీలేను కావాలనే తప్పించారు

యూరప్‌లో ఇంగ్లాండ్‌ ఖండాంతర ప్రత్యర్థులైన జర్మనీ, ఇటలీ అప్పటికే పుట్‌బాల్ వరల్డ్‌కప్ ట్రోఫీని నెగ్గాయి. దీంతో ఇంగ్లీషు గడ్డపై జరుగుతున్న వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. దీంతో బ్రెజిల్‌ను తప్పిస్తే ట్రోఫీ నెగ్గడం తేలికని ఇంగ్లాండ్‌కు చెందిన రిఫరీలు పథకం రచించారు. ఇందులో భాగంగా ఇంగ్లాండ్, వెస్ట్ జర్మనీకి చెందిన రిఫరీలు బ్రెజిల్‌ను ఫస్ట్ గేమ్ నుంచే టార్గెట్ చేశారు. దీంతో పాటు యూరోపియన్ ప్రత్యర్ధి జట్లు అయిన బల్గేరియా, పోర్చుగల్ సైతం పీలేను కాంపిటేషన్‌ను నుంచి తప్పించేందుకు సాయపడ్డాయి.

సౌకర్యాలు కల్పించడంలో విఫలం

సౌకర్యాలు కల్పించడంలో విఫలం

దీంతో పీలే చేసిన రెండు గోల్స్ సరైనవి కావంటూ పీలేను టోర్నీ నుంచి తప్పించాయి. ఇంకేముందు బ్రెజిల్ గ్రూప్ స్టేజిలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక, వరల్డ్‌కప్ గెలవడం ఇంగ్లాండ్ సులభం అయింది. ఈ వివాదం అప్పట్లో ఇంగ్లాండ్-బ్రెజిల్ దౌత్య సంబంధాలపై కూడా ప్రభావం చూపింది. దీంతో పాటు ఆ వరల్డ్‌కప్‌లో మీడియా కమ్యూనికేషన్, సందర్శించే జట్లకు తగిన సౌకర్యాలు కల్పించడంలో ఇంగ్లాండ్ విఫలమైంది.

Story first published: Tuesday, July 16, 2019, 13:03 [IST]
Other articles published on Jul 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X