జెర్సీపై 'చీట్స్': ప్రపంచకప్‌కు ముందే వార్నర్‌పై విమర్శలు

బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా ఏడాది పాటు నిషేధం ఎదుర్కొని తాజాగా జట్టులోకి వచ్చిన ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై 'చీట్స్' అంటూ విమర్శలు వస్తున్నాయి. వార్నర్‌తో పాటు మరికొందరిపై కూడా విమర్శల దాడి మొదలైంది. అయితే ఈ విమర్శలు చేస్తుంది ఎవరో కాదు ఇంగ్లాండ్ క్రికెట్‌కు సంబంధించిన ఓ ట్విటర్ పేజీ.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఫేవరెట్‌గా ఇంగ్లాండ్, భారత్:
యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు పోటాపోటీగా తలపడుతాయి. ఆ సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరిపై మరోకరు కయ్యానికి కాలుదువ్వుతారు. అదే సమయంలో అభిమానులు కూడా విమర్శల వర్షం కురిపిస్తారు. ఇక ఇంగ్లాండ్ అండ్ వేల్స్ వేదికగా మే 30 నుంచి 2019 ప్రపంచకప్ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భారత్, ఇంగ్లాండ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా.. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆస్ట్రేలియా కూడా రేసులో ఉంది.
వార్నర్‌ను టార్గెట్ చేశారు:
ప్రపంచకప్ నేపథ్యంలో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ విమర్శలు మొదలుపెట్టింది. ఇంగ్లాండ్ క్రికెట్‌కు సంబంధించిన బార్మీ ఆర్మీ ట్విటర్ పేజీ.. ఆసీస్ ఆటగాళ్లను ఉద్దేశిస్తూ పోస్టులు పెడుతూ విమర్శల దాడి మొదలెట్టింది. బార్మీ ఆర్మీ ట్విటర్ పేజీలో ఆసీస్ ఆటగాళ్ల ఫొటోలు మార్ఫింగ్ చేసి పోస్టులు పెట్టారు. ముఖ్యంగా బాల్ టాంపరింగ్ వివాదంలో ఇరుక్కుని నిషేధం ఎదుర్కొన్న డేవిడ్ వార్నర్‌ను టార్గెట్ చేశారు.

ఆస్ట్రేలియాకు బదులుగా 'చీట్స్':
పోస్టులో డేవిడ్ వార్నర్ వేసుకున్న ఆస్ట్రేలియా జెర్సీపై ఆస్ట్రేలియాకు బదులుగా 'చీట్స్' అని రాశారు. అంతటితో ఆగకుండా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్, స్పిన్నర్ నాథన్ లియోన్ చేతుల్లో సాండ్ పేపర్ పట్టుకున్నట్లు ఫొటోలు పోస్టు చేసి.. క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త జెర్సీని విడుదల చేసింది అని కామెంట్ రాశారు. 'ఇలాంటి విమర్శలకు మా జట్టు భయపడదు. అన్నిటికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రపంచకప్‌లో మా సత్తా చాటుతాం' అని ఆస్టేలియా కోచ్ జసిన్ లాంగర్ అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications