Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా అగ్రస్థానానికి ఎసరుపెడుతున్న ఇంగ్లాండ్

England rise to second in Test team rankings

హైదరాబాద్: కొద్ది రోజులుగా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానంలో కొనసాగుతున్న టీమిండియా స్థానానికి ప్రమాదం ముంచుకొచ్చింది. ఇప్పుడు భారత్ నెం.1 ర్యాంక్‌ని ఇంగ్లాండ్ టార్గెట్ చేసేలా కనిపిస్తోంది. శ్రీలంకతో సోమవారం ముగిసిన 3 టెస్టుల సిరీస్‌ని 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లాండ్ జట్టు ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ రెండో స్థానానికి ఎగబాకింది.

ఆసీస్ టెస్టు సిరీస్‌లో మెరుగ్గా రాణిస్తేనే:

ఆసీస్ టెస్టు సిరీస్‌లో మెరుగ్గా రాణిస్తేనే:

ప్రస్తుత స్థానాన్ని టీమిండియా సుస్థిరం చేసుకోవాలంటే మరి కొద్ది రోజుల్లో మొదలుకానున్న ఆసీస్ టెస్టు సిరీస్‌లో మెరుగ్గా రాణించాలి. భారత్ జట్టు ప్రస్తుతం 116 పాయింట్లతో నెం.1 స్థానంలో కొనసాగుతుండగా.. 108 పాయింట్లతో ఇంగ్లాండ్ రెండో స్థానంలో నిలిచింది. డిసెంబరు 6 నుంచి ఆస్ట్రేలియా గడ్డపై 4 టెస్టుల సిరీస్ జరగనుంది.

3-0తో గెలిచి ఒక ర్యాంక్‌‌ పైకి ఎగబాకగా..

3-0తో గెలిచి ఒక ర్యాంక్‌‌ పైకి ఎగబాకగా..

శ్రీలంకతో టెస్టు సిరీస్‌‌ని మూడో ర్యాంక్‌‌తో ప్రారంభించిన ఇంగ్లాండ్ 3-0తో గెలిచి ఒక ర్యాంక్‌‌ పైకి ఎగబాకగా.. క్లీన్‌స్వీప్‌తో ఆరో స్థానం‌లో ఉన్న శ్రీలంక జట్టు ఒక స్థానం దిగజారి ఏడో స్థానానికి పడిపోయింది. వరుసగా 3 టెస్టు విజయాలతో ఇంగ్లాండ్ ఖాతాలో 3 పాయింట్లకు చేరగా.. శ్రీలంక ఖాతాలో 4 పాయింట్లు కోత పడింది.

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ జాబితాని ప్రకారం:

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ జాబితాని ప్రకారం:

తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ జాబితాని ఓ సారి పరిశీలిస్తే టాప్ 10లో నిలిచిన దేశాల జాబితా ఇలా ఉంది. భారత్ 116 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. తర్వాత వరుసగా ఇంగ్లాండ్ (108), దక్షిణాఫ్రికా (106), న్యూజిలాండ్ (102), ఆస్ట్రేలియా (102), పాకిస్థాన్ (95), శ్రీలంక (97), వెస్టిండీస్ (63), బంగ్లాదేశ్ (63), జింబాబ్వే (13) టాప్-10లో నిలిచాయి.

 ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా

ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా

ఇదిలా ఉంటే మరి కొద్ది రోజుల్లో ఆస్ట్రేలియాతో టీమిండియా ఆడి తమ స్థానం పదిలం చేసుకోవడం ఆ జట్టుకు ఒక అవకాశమైతే.. ప్రస్తుతం జరుగుతోన్న మ్యాచ్‌లు బంగ్లాదేశ్ వర్సెస్ వెస్టిండీస్, పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్‌ల ద్వారా వాటి భవితవ్యమూ మారనుంది.

జరగనున్న అంతర్జాతీయ టెస్టు సిరీస్‌ల వివరాలు:

ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా (4 టెస్టులు, 12 డిసెంబరు-7 జనవరి)

న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక (2 టెస్టులు, 15-30 డిసెంబరు)

దక్షిణాఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ (3 టెస్టులు, 26 డిసెంబరు-15 జనవరి)

వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్ (3 టెస్టులు, 23 జనవరి-13 ఫిబ్రవరి)

ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక (2 టెస్టులు, 24 జనవరి-5 ఫిబ్రవరి)

దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక (2 టెస్టులు, 13-25 ఫిబ్రవరి)

న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ (3 టెస్టులు, 28 ఫిబ్రవరి-20 మార్చి)

Story first published: Tuesday, November 27, 2018, 15:15 [IST]
Other articles published on Nov 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+