Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కివీస్‌తో టెస్టు సిరిస్‌కు బెన్ స్టోక్స్ ఎంపిక

England recall Ben Stokes for New Zealand Test series after Ashes ban

హైదరాబాద్: త్వరలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లే 16 మందితో కూడిన ఇంగ్లాండ్ టెస్టు జట్టుని గురువారం వేల్స్ అండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ టెస్టు జట్టులో యాషెస్‌ సిరీస్‌కు దూరమైన ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ న్యూజిలాండ్ పర్యనటకు గాను చోటు దక్కించుకున్నాడు.

అంతేకాదు లంకషైర్‌ బ్యాట్స్‌మన్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌ టెస్టుల్లో ఈ సిరిస్‌తో అరంగేట్రం చేయనున్నాడు. మరోవైపు గాయం నుంచి కోలుకున్న సీమర్‌ మార్క్‌ ఉడ్‌ కూడా టెస్టుల్లో పునరాగమనం చేయనున్నాడు. ఇక, ఇటీవల ముగిసిన యాషెస్‌ సిరీస్‌లో విఫలమైన మొయిన్‌ అలీ, జేమ్స్‌ విన్స్‌, మార్క్‌ స్టోన్‌మన్‌లకు కూడా జట్టులో చోటు కల్పించారు.

ఇదిలా ఉంటే యాషెస్ సిరిస్‌లో అత్యంత చెత్త ప్రదర్శన చేసిన గ్యారీ బ్యాలెన్స్‌, జేక్‌ బాల్‌, టామ్‌ కరన్‌‌లకు మాత్రం న్యూజిలాండ్ పర్యటనకు గాను చోటు దక్కలేదు. న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్‌ జట్టు రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది.

గతేడాది సెప్టెంబర్‌లో బ్రిస్టల్‌లోని ఓ నైట్‌క్లబ్‌‌లో తప్ప తాగిన స్టోక్స్‌ ఓ వ్యక్తిపై దాడికి పాల్పడటంతో అతన్ని అరెస్ట్ చేయడం ఆ తర్వాత విడుదల చేయడం జరిగింది. ఈ కేసు నిమిత్తం లండన్ పోలీసులు బెన్ స్టోక్స్‌ను విచారిస్తున్నారు. దీంతో దర్యాప్తు పూర్తయ్యే వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో పాల్గొనకుండా కొన్నిరోజుల పాటు అతనిపై ఇంగ్లాండ్‌ అండే వేల్స్ క్రికెట్‌ బోర్డు నిషేధం విధించింది.

దీంతో ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన ఐదు టెస్టుల యాషెస్‌ సిరీస్‌కు దూరమయ్యాడు. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌ను ఆతిథ్య ఆస్ట్రేలియా 4-0తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, January 12, 2018, 15:18 [IST]
Other articles published on Jan 12, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+