For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

England Playing XI vs Bangladesh: టీ20 చరిత్రలో తొలిసారిగా ఈ రెండు జట్లు ఫేస్ టు ఫేస్

England Playing XI vs Bangladesh: This will be the first meeting between the two sides in T20I cricket

అబుధాబి: యునైటెడ్ ఎమిరేట్స్ వేదికగా కొనసాగుతోన్న టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో మరో ఆసక్తికరమైన పోరాటానికి ఈ మధ్యాహ్నం తెర లేవననుంది. ఇంగ్లాండ్ జట్టు, బంగ్లాదేశ్‌తో తలపడనుంది. పొట్టి ఫార్మట్ మ్యాచ్‌లల్లో ఇప్పటిదాకా ఈ రెండు జట్లు ఎప్పుడూ ఎదురు పడలేదు..మ్యాచ్ ఆడలేదు. ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ మధ్య తొలిసారిగా టీ20 మ్యాచ్ జరుగనుంది. దీనికి టీ20 ప్రపంచ కప్ మెగా ఈవెంట్ వేదిక కావడం ఆసక్తిగా మారింది.

ఇంగ్లాండ్ గెలుపులో బోణీ..

ఇంగ్లాండ్ గెలుపులో బోణీ..

సూపర్ 12లో.. గ్రూప-1లో భాగంగా అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ టీ20 ప్రపంచకప్‌లో తన జైత్రయాత్రను మొదలు పెట్టింది. తాను ఎదుర్కొన్న తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ వీరులను మట్టి కరిపించింది. ఇక తన రెండో మ్యాచ్‌లోనూ ఈ పరంపరను కొనసాగించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. బంగ్లాదేశ్‌పై ఇప్పటిదాకా టీ20 ఆడిన అనుభవం లేనప్పటికీ.. జట్టు లోటుపాట్లు, బలాలు, బలహీనతలు తెలిసివున్నందున దానికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటోందా ఇంగ్లీష్ టీమ్.

భిన్నంగా బంగ్లా టైగర్లు..

భిన్నంగా బంగ్లా టైగర్లు..

బంగ్లా టైగర్ల పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంటోంది. సూపర్ 12లో తన ఖాతాను అపజయంతో ఓపెన్ చేసింది. శ్రీలంకపై ఓటమి చవి చూసింది. భారీ స్కోర్‌ను సాధించినా.. బౌలింగ్‌లో రాణించినా.. పెద్దగా ఫలితం దక్కలేదు. వెంటవెంటనే వికెట్లను పడగొట్టి శ్రీలంక జట్టుకు కొంతవరకు కంగారు పెట్టగలిగింది. మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు నిలదొక్కుకోవడంతో బంగ్లాదేశ్ బౌలర్ల ఆటలు సాగలేదు. భారీ స్కోర్‌ను సాధించినప్పటికీ.. బౌలర్లు తడబడటంతో జట్టుు విజయం దూరమైంది.

మార్పులు లేనట్టే..

మార్పులు లేనట్టే..

ఈ మధ్యాహ్నం మొదలు కానున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు పెద్దగా ప్రయోగాలకు సిద్ధపడట్లేదు. తుదిజట్టులోనూ ఎలాంటి మార్పులు చేయట్లేదు. విండీస్‌పై విజయాన్నిసాధించిన జట్టుతోనే బరిలోకి దిగనుంది. అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్‌లో రాణించడంతో మార్పులు చేయదలచుకోవట్లేదని ఇంగ్లాండ్ టీమ్ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. వెస్టిండీస్‌పై గెలిచిన జట్టును యధాతథంగా ఆడిస్తామని పేర్కొంది. జట్టు ఆటగాళ్లందరూ సమష్టిగా సత్తాచాటడం వల్లే విండీస్‌పై విజయం సాధించగలిగామని తేల్చి చెబుతోంది.

సైఫుద్దీన్‌కు గాయం..

సైఫుద్దీన్‌కు గాయం..

బంగ్లాదేశ్ జట్టులో మార్పులు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది. కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలర్ మహ్మద్ సైఫుద్దీన్ గాయపడ్డాడు. అతని స్థానంలో రుబెల్ హొస్సేన్‌ను రీప్లేస్ చేయనుంది బంగ్లాటీమ్. ఫామ్‌లో ఉన్న బౌలర్ జట్టుకు దూరం కావడం ఒకింత ఇబ్బందుల్లో పడినట్టే కనిపిస్తోన్నారు బంగ్లా టైగర్లు. పైగా- బలమైన ఇంగ్లాండ్ జట్టును ఢీ కొట్టాల్సిన మ్యాచ్ కావడం వల్ల ఫలితం ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.

రెండు జట్లు ఇలా ఉండొచ్చు..

రెండు జట్లు ఇలా ఉండొచ్చు..

ఇంగ్లాండ్ జట్టులో జేసన్ రాయ్, జోస్ బట్లన్ (వికెట్ కీపర్), డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, ఇవాన్ మోర్గాన్ (కేప్టెన్), మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, టైమల్ మిల్స్ తుది జట్టులో చోటు దక్కించుకోవడం దాదాపు ఖాయమైంది. ఇక బంగ్లాదేశ్ టీమ్‌లో మహ్మద్ నయీం, లిట్టన్ దాస్, షకీబుల్ హసన్, ముష్పికుర్ రహీం, మహ్మదుల్లా (కేప్టెన్), అఫిఫ్ హొస్సేన్, నూరుల్ హసన్ (వికెట్ కీపర్), మెహదీ హసన్, తస్కిన్ అహ్మద్, నాసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆడొచ్చు.

Story first published: Wednesday, October 27, 2021, 11:18 [IST]
Other articles published on Oct 27, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+