Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లాండ్ జట్టులోకి తిరిగొచ్చిన దిగ్గజ ప్లేయర్లు.. న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్ ఆడబోయే జట్టు ఇదే

 England Playing 11 For New Zealand Test: James Anderson and Stuart Broad Back to the side

న్యూజిలాండ్‌తో లార్డ్స్‌లో గురువారం ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్టు కోసం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్లేయింగ్ 11 ప్రకటించింది. కౌంటీ ఛాంపియన్ షిప్‌లో రాణించిన డర్హామ్ జట్టు ప్లేయర్ మాథ్యూ పాట్స్‌ ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేయబోతున్నాడు. ఇక ఇంగ్లాండ్ వెటరన్ పేస్ బౌలర్లు జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌ తిరిగి జట్టులోకి వచ్చారు. 39ఏళ్ల అండర్సన్, 35ఏళ్ల బ్రాడ్ ఇంగ్లాండ్ ఆల్ టైం అత్యుత్తమ బౌలర్లలో ఇద్దరు. వారిద్దరూ కలిసి 1,177వికెట్లు తీశారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో వెస్టిండీస్‌‌తో ఇంగ్లాండ్ 1-0తో సిరీస్ ఓడిపోవడంతో వారిద్దరిని జట్టు నుంచి తప్పించారు.

కొత్త కెప్టెన్, కొత్త కోచ్ ఆధ్వర్యంలో మళ్లీ జట్టులోకి

కొత్త కెప్టెన్, కొత్త కోచ్ ఆధ్వర్యంలో మళ్లీ జట్టులోకి

అయితే ఇంగ్లాండ్ కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్, కొత్త కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ ఆధ్వర్యంలో వీరిరువురు తిరగి జట్టులో చేరారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టుకోసం బుధవారం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్లేయింగ్ 11ను ప్రకటించింది. ఇకపోతే మార్క్ వుడ్, క్రిస్ వోక్స్, ఒల్లీ రాబిన్సన్, జోఫ్రా ఆర్చర్, సాకిబ్ మహమూద్, మాట్ ఫిషర్, ఆలీ స్టోన్‌తో సహా చాలా మంది ఫాస్ట్ బౌలర్లు గాయాల కారణంగా జట్టుకు దూరం కావడం కూడా అండర్సన్, బ్రాడ్ పునరాగమనానికి కారణమైంది.

కౌంటీ సీజన్లో రాణించిన పాట్స్‌‌ జట్టులోకి

కౌంటీ సీజన్లో రాణించిన పాట్స్‌‌ జట్టులోకి

23 ఏళ్ల మాథ్యూ పాట్స్ కౌంటీ సీజన్లో అద్భుతంగా రాణించాడు. దీంతో అతన్ని ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు ఎంపిక చేసింది. అతను ఆరు కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లలో డర్హామ్ తరఫున 35వికెట్లు పడగొట్టాడు. కౌంటీల్లో రాణించిన యార్క్ షైర్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ తన టెస్టు అరంగేట్రం కోసం వేచి ఉండక తప్పలేదు. బ్రూక్ కౌంటీల్లో ఇప్పటివరకు 140 సగటుతో 840 పరుగులు చేశాడు.. కానీ అతనికి ప్లేయింగ్ 11లో మాత్రం చోటు దక్కలేదు.

అట్టడుగు స్థానంలో ఇంగ్లాండ్

అట్టడుగు స్థానంలో ఇంగ్లాండ్

ఇకపోతే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (2021 - 2023) పట్టికలో ఇంగ్లాండ్ ప్రస్తుతం 17మ్యాచ్‌లలో కేవలం ఒక విజయం మాత్రమే సాధించి అట్టడుగు స్థానంలో ఉంది. ఇది మునుపెన్నడూ ఇంగ్లాండ్ జట్టు ఇలాంటి గడ్డు పరిస్థితి ఎదురుకోలేదు. టెస్టులకు అధిక ప్రాధాన్యమిచ్చే ఇంగ్లాండ్ జట్టు ఈ రకమైన ప్రదర్శన కనబర్చడం కాస్త విస్మయపరిచేదే. ఇక వరుస ఓటములకు బాధ్యత వహిస్తూ.. జో రూట్ ఇటీవల రాజీనామా చేయడంతో అతని స్థానంలో పూర్తి స్థాయి కెప్టెన్‌గా స్టోక్స్ బాధ్యతలు చేపట్టనున్నాడు.

నేడు విలేకరుల సమావేశం

నేడు విలేకరుల సమావేశం

ఇకపోతే న్యూజిలాండ్ మాత్రం తన ప్లేయింగ్ 11ను ప్రకటించలేదు. గత ఏడాది సౌతాంప్టన్‌లో జరిగిన టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో భారత్‌ను ఓడించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌గా న్యూజిలాండ్ నిలిచిన సంగతి తెలిసిందే. ఇక తొలి టెస్టుకు ముందు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇద్దరూ బుధవారం లార్డ్స్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించనున్నారు.

లార్డ్స్‌లో న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ఆడనున్న ఇంగ్లాండ్ జట్టు

లార్డ్స్‌లో న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ఆడనున్న ఇంగ్లాండ్ జట్టు

జాక్ క్రాలీ, అలెక్స్ లీస్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), మాథ్యూ పాట్స్, జాక్ లీచ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్

Story first published: Wednesday, June 1, 2022, 15:15 [IST]
Other articles published on Jun 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+