Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్యాచ్ పట్టడానికి డ్రెస్ విప్పేసిన స్టార్ ప్లేయర్.. వీడియో వైరల్!

England player removes shirt to take a catch

క్రికెట్‌లో క్యాచులు ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిందే. ఒక్క క్యాచ్ మిస్సయితే మ్యాచ్ ఫలితం మారిపోతుంది. అందుకే 'క్యాచెస్ విన్స్ మ్యాచెస్' అంటారు. ఈ క్రమంలోనే అన్ని జట్లు కూడా ప్రాక్టీస్ సమయంలో క్యాచులకు ప్రత్యేక సెషన్స్ తీసుకుంటాయి. ఇలాంటి ఒక సెషన్‌లో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ మార్క్ వుడ్ చేసిన పని ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. క్యాచ్ ప్రాక్టీస్ సమయంలో టెన్నిస్ రాకెట్‌తో బంతిని గాల్లోకి కొడుతుంటే ఇంగ్లిష్ క్రికెటర్లు క్యాచులు పడుతున్నారు. అప్పుడే మార్క్ వుడ్ వంతు కూడా వచ్చింది.

బంతి గాల్లోకి లేవడం చూసిన అతను గబగబా ముందుకొచ్చి తన క్యాప్ తీసేశాడు. వెంటనే తను వేసుకున్న టీ షర్ట్‌ను బలంగా తీసేసి పక్కన పడేశాడు. ఆ తర్వాత షార్ట్ కూడా కింద పడేసి క్యాచ్ పట్టుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. క్యాచ్ పట్టడానికి అతను ఇవన్నీ ఎందుకు చేశాడో తెలియని నెటిజన్లు తలలు గోక్కుంటున్నారు. మరికొందరేమో అతను అంత త్వరగా క్యాచింగ్ పొజిషన్‌కు వచ్చేయడం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంగ్లండ్ తరఫున ఇటీవలి కాలంలో అత్యంత కీలకమైన బౌలర్‌గా మార్క్ వుడ్ ఎదిగిన సంగతి తెలిసిందే.

వెటరన్ బౌలర్లు జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ రిటైర్ అయిపోతే.. ఇంగ్లండ్ బౌలింగ్ విభాగం భవిష్యత్తు ఏంటి? అనుకుంటున్న సమయంలో మార్క్ వుడ్ రావడం ఆ దేశ అభిమానులకు గొప్ప ఊరటనిచ్చింది. అతనితోపాటు బెన్ స్టోక్స్, శామ్ కర్రాన్ వంటి వాళ్లు కూడా బంతితో భరోసా ఇస్తున్నారు. కాగా, ప్రస్తుతం న్యూజిల్యాండ్‌తో ఇంగ్లండ్ జట్టు టెస్టు సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో ఇంగ్లండ్ జట్టు టెస్టులు ఆడాల్సి ఉంది. అనంతరం ఐపీఎల్ కోసం ఇంగ్లిష్ ప్లేయర్లు భారత్ చేరుకుంటారు.

Story first published: Monday, February 27, 2023, 8:53 [IST]
Other articles published on Feb 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+