పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో చీకటి రోజులు చూశాను, మానసికంగా కుంగిపోయాను : ఇంగ్లాండ్ బ్యాటర్ జేసన్ రాయ్

పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో ఆడినన్ని రోజులు మానసికంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నానని ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జేసన్ రాయ్ సంచలన కామెంట్లు చేశాడు. పీఎస్‌ఎల్ ఆడే రోజుల్లో ఎక్కడ లేని మానసిక క్షోభ తనను వేధించేదని పేర్కొన్నాడు. ఆ రోజులు తన జీవితంలో చీకటి రోజులుగా అభివర్ణించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ నెదర్లాండ్స్‌తో 3 వన్డేల సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. వరుసగా రెండు వన్డేల్లో గెలిచిన ఇంగ్లాండ్ సిరీస్ కైవసం చేసుకుంది. ఇక రెండో వన్డేలో జేసన్ రాయ్ (60 బంతుల్లో 13 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 73పరుగులు) హాఫ్ సెంచరీతో రాణించి ఇంగ్లాండ్ గెలుపు బాటలో నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా రాయ్ నిలిచాడు. ఇక చివరి వన్డే రేపు జరగనుంది. ఇక రెండో వన్డే అనంతరం జేసన్ రాయ్ మాట్లాడుతూ.. తాను పీఎస్‌ఎల్‌లో ఎదుర్కొన్న విపరీత అనుభవాలను షేర్ చేసుకున్నాడు.

ఏమాత్రం క్రికెట్‌ను ఆస్వాదించలేకపోయా
ఐపీఎల్‌కి ముందు జరిగిన పీఎస్‌ఎల్ - 2022 సీజన్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున జేసన్ రాయ్ ఆడాడు. క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున ఆరు ఇన్నింగ్స్‌లలో 50.50 సగటుతో 170.22 స్ట్రైక్ రేటుతో 303పరుగులు చేశాడు. అతను ఆ సీజన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ కూడా. అయితే తాను సక్సెస్ అయినప్పటికీ ఎక్కడో చిన్న బాధ తనను తొలిచివేసేదని అతను పేర్కొన్నాడు. ఎంత రాణించినా మానసిక ప్రశాంతత మాత్రం ఉండకపోయేదన్నాడు. క్రికెట్‌ను ఎంతో ఆస్వాదించే తాను పీఎస్‌ఎల్‌లో ఆడినన్ని రోజులు ఏమాత్రం ఆస్వాదించలేకపోయానని పేర్కొన్నాడు.

నా బిడ్డకు నేను దూరంగా ఉండాల్సొచ్చింది
'పీఎస్‌ఎల్‌లో మానసికంగా నేను బాలేను. నేను ఓ విచిత్రమైన ప్రదేశంలో ఉన్నాననే ఫీలింగ్ కలిగింది. నేను మంచిగానే క్రికెట్ ఆడుతున్నాను కానీ నేను ఆనందించలేకపోయాను. నేను అస్సలు సంతోషంగా లేను. ఆ రోజులు చీకటి రోజులు. పీఎస్ఎల్ తర్వాత మా ఇంటికి వచ్చి నా కుటుంబంతో గడిపాను. ఈ రెండు నెలలు నాకు సరైన విరామం దొరికింది. అంతకుముందు రెండేళ్లుగా నిర్విరామంగా ఆట ఆడడంతో కుటుంబానికి దూరమయ్యాను. అలాగే పీఎస్ఎల్ కోసం 50రోజుల పాటు హోటల్ క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చింది. జనవరిలో నాకు బిడ్డ పుట్టింది. కానీ నా బిడ్డకు నేను దూరంగా ఉండాల్సి వచ్చింది. అది నన్ను చాలా మానసిక క్షోభకు గురిచేసింది' అని రాయ్ స్కై స్పోర్ట్స్‌తో తెలిపాడు.

అందుకే ఐపీఎల్ ఆడలేదు
ఇకపోతే నేను ఇంట్లో కొంత సమయం గడపడానికి ఐపీఎల్ ఆడలేదు. కుటుంబంతో గడపడం ద్వారా నా మైండ్, బాడీ రిఫ్రెష్ అయింది. నేను చాలా విషయాలు కాస్త రిలాక్స్‌గా ఫీలయ్యాను. ఇప్పుడు మళ్లీ ఇంగ్లాండ్ జట్టు తరఫున ఆడడం ఆనందంగా ఉంది. ఇంతకుముందు టీ20 బ్లాస్ట్‌లో సర్రే తరఫున కూడా కాస్త బానే రాణించాను. టీ20 బ్లాస్ట్ టోర్నీలో మాత్రం నేను ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తూ గేమ్ ఆడాను. మళ్లీ క్రికెట్‌తో ప్రేమలో పడ్డందుకు చాలా ఆనందంగా ఉంది. అని జేసన్ పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో జేసన్ రాయ్‌ని గుజరాత్ టైటాన్స్ కొనుక్కుంది. అయితే లీగ్ ప్రారంభానికి ముందే అతను బయోబబుల్ వల్ల తాను ఆడలేనని తప్పుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications