37 ఏళ్ల రికార్డు బద్దలు: భారత్ ముంగిట వరల్డ్ రికార్డు
హైదరాబాద్: చెన్నై వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టులో ఇంగ్లాండ్ క్రికెటర్ డాసన్ అరుదైన ఘనత సాధించాడు. ఈ టెస్టుతో అరంగేట్రం చేసిన డాసన్ 148 బంతులను ఎదుర్కొని 5 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో 66 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 477 పరుగులకు ఆలౌట్ అయింది. 284/4 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజైన శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ మరో 193 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. ఈ టెస్టులో 8వ స్ధానంలో బ్యాటింగ్‌కు దిగిన డాసన్ 60కిపైగా పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు.
అరంగేట్రం చేసిన టెస్టులో ఎనిమిదవ వికెట్‌గా బ్యాటింగ్‌కు వచ్చి ఇంగ్లాండ్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు డేవిడ్ బెయిర్ స్టో (59) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు.

నిమిదో స్థానంలో దిగి అత్యధిక వ్యక్తిగత స్కోరు
1979లో డేవిడ్ బెయిర్ స్టో తన అరంగేట్రం టెస్టులో ఎనిమిదో స్థానంలో దిగి అత్యధిక వ్యక్తిగత స్కోరుని నమోదు చేశాడు. తాజాగా ఆ స్కోరును డాసన్ అధిగమించడంతో 37 ఏళ్ల రికార్డు బద్దలైంది. ఐదో టెస్టులో వికెట్లు పడుతున్నా, టెయిలెండర్ల నిలకడగా రాణించడంతో ఇంగ్లాండ్ భారీ స్కోరు నమోదు చేసింది.

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 477 ఆలౌట్
రెండో రోజు ఆటలో భాగంగా బెయిర్ స్టో(49), బట్లర్(5), మొయిన్ అలీ(146) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో ఇంగ్లాండ్ తడబడింది. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రషీద్, డాసన్ అర్ధ సెంచరీలతో చెలరేగడంతో ఇంగ్లాండ్ 400కు పైగా పరుగులు చేసింది. వీరిద్దరూ 108 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.

చెపాక్‌లో ఎనిమిదో వికెట్‌కు రెండో అత్యుత్తమ భాగస్వామ్యం
దీంతో చెపాక్ స్టేడియంలో ఎనిమిదో వికెట్‌కు రెండో అత్యుత్తమ భాగస్వామ్యాన్ని ఈ జోడీ నమోదు చేసింది. ఈ స్టేడియంలో అత్యుత్తమ భాగస్వామ ఎనిమిదో వికెట్ భాగస్వామ్యం ఇమ్రాన్ ఖాన్-వసీం అక్రమ్‌ల పేరిట ఉంది. 1987లో ఇమ్రాన్-వసీంలు ఇక్కడ నమోదు చేసిన 112 పరుగులు ఇప్పటికీ అత్యుత్తమ భాగస్వామ్యం.

భారత్‌కు మరో రికార్డు బద్దలు కొట్టే ఛాన్స్
మరోవైపు చెన్నై టెస్టులో టీమిండియా మరో రికార్డు బద్దలు కొట్టే ఛాన్స్ వచ్చింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ముంబైలో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసినా ఓడిపోయింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకూ రెండు వరుస టెస్టుల్లో తొలి ఇన్నింగ్స్‌లో 400 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసి ఓడిపోయిన సందర్భం ఒక్కసారే జరిగింది.

ఆసీస్ చేతిలో రెండుసార్లు టీమిండియా ఓటమి
2010లో భారత్ చేతిలో ఆస్ట్రేలియా జట్టు వరుస మ్యాచ్‌లలో వారి తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వందలకుపైగా పరుగులు చేసి కూడా ఓడిపోయింది. మొహాలిలో 428, బెంగళూరులో 478 పరుగులు చేసిన టీమిండియా ఓటమి పాలైంది. అయితే ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టును ఆ విధంగా ఓడించే అవకాశం మళ్లీ ఐదు సంవత్సరాలకు టీమిండియాకు దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications