Markwood Injured: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరుగుతోన్న కీలక చావురోవో మ్యాచ్ లో ఇంగ్లాండ్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఆ జట్టు ఆటగాడు బ్రైడన్ కార్సె గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో పేసర్ కూడా గాయంతో దూరం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అప్ఘానిస్థాన్ తో జరుగుతోన్న మ్యాచ్ లో ఇంగ్లాండ్ పేసర్ మార్క్ వుడ్ గాయం తగిలి మ్యాచ్ మధ్యలో రెండు సార్లు మైదానాన్ని వీడాడు.
అసలేం జరిగిందంటే?
అప్ఘానిస్థాన్ ఇన్నింగ్ ప్రారంభించిన తర్వాత.. తన నాలుగో ఓవర్లో ఇంగ్లాండ్ పేసర్ మార్క్ వుడ్ మోకాలికి గాయమైంది. దీంతో అతడు కాసేపు మైదానంలో కూర్చుండి పోయాడు. అప్పుడు ఫిజియో వచ్చి తాత్కాలిక చికిత్స అందించగా కాస్త అసౌకర్యంగానే తిరిగి బౌలింగ్ చేశాడు వుడ్. అలా తన ఓవర్ ను పూర్తి చేసుకుని మైదానాన్ని వీడాడు.

మళ్లీ కాసేపటి తర్వాత..
ఆ తర్వాత అప్ఘానిస్థాన్ స్కోర్ 167/4 (కాస్త అటు ఇటుగా) ఉన్న సమయంలో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు మార్క్ వుడ్. అప్పుడు తన ఎడమ కాలిలో అసౌకర్యంతోనే బౌలింగ్ చేస్తూ ఇబ్బంది పడుతూ కనిపించాడు. ఆ తర్వాత కాసేపటికి మరోసారి మైదానాన్ని వీడాడు. దీంతో అతడు తన 10 ఓవర్ల కోటా పూర్తి చేయడం అనుమానంగానే మారింది. అతడు ఇప్పటివరకు తన 8 ఓవర్ల కోటాలో ఒక్క వికెట్ కూడా తీయకుండా 50 పరుగులు సమర్పించుకున్నాడు.
ఐపీఎల్ ఆడతాడా?
మార్క్ వుడ్ ఐపీఎల్ లో సీఎస్కే, లఖ్ నవూ సూపర్ జెయింట్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. కానీ అతడు తరచుగా గాయాల బారిన పడటం వల్ల తక్కువ ఐపీఎల్ మ్యాచులే ఆడాడు. ఐదు మ్యాచుల్లో 16.27 యావరేజ్, 10.91 స్ట్రైక్ రేట్ తో 11 వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో అతడిని ఈ సీజన్ ఐపీఎల్ వేలంలో కొనడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు. కాబట్టి అతడు ఎలాగో ఐపీఎల్ ఆడే అవకాశం లేదు.
Mark Wood has left the field after sustaining a suspected injury to his left knee 👀#MarkWood #ENGvAFG #ODIs pic.twitter.com/iW1pf6xIH0
— OneCricket (@OneCricketApp) February 26, 2025