ఆర్చర్ అదిరే ఐడియా: ప్రేక్షకులు లేకుంటే ఏం.. ఆడియోలు చూస్తూ ఎంజాయ్ చేద్దాం!!

లండన్: కరోనా వైరస్ (కొవిడ్-19) మహమ్మారి వ్యాప్తి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రీడాలోకం స్తంభించిపోయింది. క్రికెట్, టెన్నిస్, బాడ్మింటన్, ఫుట్‌బాల్, బాక్సింగ్ ఎలాంటి ఆటలు సాగట్లేదు. ఇక లాక్‌డౌన్ కారణంగా వేసవిలో క్రికెట్ అభిమానులకు మజాను పంచే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 నిరవధికంగా వాయిదా పడటంతో ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రస్తుతానికి క్రీడా ఈవెంట్లు మొదలవడం దాదాపు అసాధ్యమే. ఒకవేళ కరోనా వ్యాప్తి తగ్గినా.. ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు నిర్వహించాల్సిన పరిష్టితి.

ఆడియోలు చూస్తూ ఎంజాయ్ చేద్దాం
ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు నిర్వహించాడాన్ని చాలా మంది సపోర్ట్ చేస్తుండగా.. కొంతమంది మాత్రమే మజా ఉండదు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అదిరిపోయే సలహా ఇచ్చాడు. క్రీడలు మొదలయ్యాక స్టేడియాల్లో ప్రేక్షకులు చేసే గోలను ఆడియో రూపంలో ఏర్పాటు చేస్తే.. మైదానంలో వారు ఉన్నట్లే ఫీలవుతామని ఆర్చర్ పేర్కొన్నాడు. మొత్తానికి ప్రేక్షకులు లేకుంటే ఏం.. ఆడియోలు చూస్తూ ఎంజాయ్ చేద్దాం అని ఆర్చర్ అంటున్నాడు.

ప్రేక్షకులు లేకుండా ఆడొచ్చు
తాజాగా జోఫ్రా ఆర్చర్ మాట్లాడుతూ... 'మనం స్టేడియాల్లో ప్రేక్షకులు లేకుండా ఆడొచ్చు. మ్యాచ్ జరుగుతున్నంతసేపు ఆడియో ప్లే చేద్దాం. చప్పట్లు, ఈలలతో స్టేడియాలను మార్మోగేలా చేద్దాం. దాంతో మ్యాచ్‌లు ఆడే క్రికెటర్లకు తప్పకుండా ఊపు వస్తుంది. ప్రేక్షకులు ఉన్నట్లే ఫీల్ అవుతారు. అయితే ఆడియో ప్లేలు వాస్తవిక మ్యాచ్‌లను తలపించేలా ఉండాలి' అని అదిరే ఐడియా ఇచ్చాడు. క్రికెట్ టోర్నీలు నిర్వహించినా సురక్షితంగా ఉండడం చాలా ముఖ్యమన్నాడు.

7.20 కోట్లకు దక్కించుకున్న రాజస్థాన్:
ఐపీఎల్ 2018 వేలంలో తనను రాజస్థాన్ రాయల్స్ తనను ఎక్కువ మొత్తం వెచ్చించి దక్కించుకుందేమోనని ఫీలయ్యానని జోఫ్రా ఆర్చర్ అన్నాడు. బిగ్‌బాష్ సహా కొన్ని లీగ్‌ల్లో ఆర్చర్ అద్భుతంగా రాణించడంతో అతడి కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. 2018 జనవరిలో జరిగిన ఐపీఎల్ వేలంలో ఆర్చర్‌ను రూ.7.20కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. ఆ తర్వాత 2019 మేలో అతడు అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఏకంగా ప్రపంచకప్ ఆడాడు.

ప్రారంభ ధరకే తీసుకుంటారనుకున్నా:
జోఫ్రా ఆర్చర్ మాట్లాడుతూ... 'వేలం కంటే ముందు క్రిస్ జోర్డాన్‌తో మాట్లాడా. నన్ను ప్రారంభ ధరకే తీసుకుంటారు. ఎవరు తీసుకున్నా.. అంతర్జాతీయ క్రికెట్ ఆడనందున నన్ను బెంచ్‌కే పరిమితం చేస్తారు. భారత్‌కు వెళ్లి ఎనిమిది వారాలు క్రికెట్ ఆడకుండా ఉండాలన్నా. ఇక నా కోసం వేలంలో పోటీ మొదలవగానే చాలా సంతోషించా. అధిక ధర దక్కడం నన్ను ఆశ్చర్యపరిచింది' అని వెల్లడించాడు. రాజస్థాన్ తరఫున 2018, 19 సీజన్లలో ఆర్చర్ అద్భుత ప్రదర్శన చేసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications