ఇంగ్లాండ్‌కు ఊహించని షాక్: యాషెస్ సిరిస్ మొత్తానికి అండర్సన్ దూరం

హైదరాబాద్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరిస్‌లో ఇంగ్లాండ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ యాషెష్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. గాయం కారణంగా గత రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడని జేమ్స్ ఆండర్సన్ మిగిలిన రెండు టెస్టులకు దూరమయ్యాడు.
ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో జేమ్స్ తుదిజట్టులో ఉన్నా.. కేవలం నాలుగు బంతులు మాత్రమే వేసి కాలి పిక్క గాయంతో... మ్యాచ్ నుంచి అర్ధంతరంగా తప్పుకున్నాడు. ఆ తర్వాతి రెండు టెస్టులకూ అండర్సన్ అందుబాటులోకి రాలేదు.
నాలుగో టెస్టుకు ఎలాగైనా జట్టులోకి రావాలని అండర్సన్ భావించి.. లాంకషైర్ తరఫున దేశవాళీ మ్యాచ్ ఆడుతుండగా పిక్క గాయం తిరగబెట్టింది. దీంతో యాషెస్ మొత్తానికి ఆండర్సన్ దూరమయ్యాడు. అండర్సన్ స్థానంలో ఆల్‌రౌండర్ ఒవెర్టన్‌ను జట్టులోకి తీసుకున్నారు.
మరోవైపు ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ నుంచి గాయం నుంచి కోలుకోవడంతో ఆ జట్టు ఊపిరి పీల్చుకుంది. రెండో టెస్టులో జోఫ్రా ఆర్చర్ బౌన్సర్‌కు స్మిత్ మైదానంలోనే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో సిరీస్ తొలి టెస్టులో ఆసీస్ 251 పరుగుల తేడాతో గెలువగా.. రెండోది డ్రాగా ముగిసింది.
మూడో టెస్టులో బెన్ స్టోక్స్ సెంచరీతో చిరస్మణీయ ఇన్నింగ్స్ ఆడటంతో వికెట్ తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. దీంతో ఇంగ్లాండ్ 1-1తో సిరిస్‌ను సమం చేసింది. నాలుగో టెస్టు ఓల్డ్‌ట్రఫోర్డ్ వేదికగా సెప్టెంబర్ 4న ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications