For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లండ్‌కు షాక్‌.. గాయం కారణంగా స్టార్ బౌలర్ దూరం!!

England pacer James Anderson ruled out of South Africa series with rib injury

పోర్ట్ ఎలిజబెత్: మంగళవారం దక్షిణాఫ్రికాతో ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ 189 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 4 టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్‌ 1-1తో సమం చేసింది. తొలి టెస్టులో ఓటమి అనంతరం రెండో టెస్టులో ఇంగ్లీష్‌ జట్టు అనూహ్యంగా పుంజుకుంది. ఇదే ఊపులో మూడో టెస్టు కూడా గెలిచి సిరీస్‌లో ఆధిపత్యం చెలాయిద్దామనుకున్న ఇంగ్లండ్‌కు షాక్‌ తగిలింది. స్టార్ సీనియర్ పేసర్ జేమ్స్‌ అండర్స్‌న్‌ గాయం కారణంగా మిగతా సిరీస్‌కు దూరమయ్యాడు.

కేప్‌టౌన్‌ టెస్టు సందర్భంగా బౌలింగ్ చేసే సమయంలో అండర్స్‌న్‌ కాస్త ఇబ్బంది పడ్డాడు. మ్యాచ్‌ అనంతరం అతనికి ఎమ్మారై స్కాన్‌ తీయించగా.. పక్కటెముకల్లో చిన్న పగుళు ఏర్పడినట్లు తేలింది. గాయం కారణంగా విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో.. అండర్సన్‌ మిగతా రెండు టెస్టులకు దూరమయ్యాడు. అండర్స్‌న్‌ పక్కటెముకల గాయం కారణంగా మిగతా సిరీస్‌కు దూరమయ్యాడని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) అధికారికంగా ప్రకటించింది.

'పేసర్ జేమ్స్‌ అండర్సన్‌ గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరగబోయే మిగతా రెండు టెస్టులకు అందుబాటులో ఉండటం లేదు' అని ఈసీబీ ట్వీట్‌ చేసింది. 'పక్కటెముకల గాయం కారణంగా ఈ సిరీస్‌లోని మిగిలిన రెండు టెస్టులకు దూరమవుతున్నందుకు నిరాశగా ఉంది. కొన్ని వారాల్లో గాయం నయం అవుతుంది' అని అండర్సన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. అయితే అండర్సన్ గాయం తీవ్రత, ఎంతకాలం విశ్రాంతి అనే దానిపై ఈసీబీ స్పష్టత ఇవ్వలేదు.

'స్వింగ్ కింగ్' అండర్సన్‌ ఇటీవలే అరుదైన రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. సెంచూరియన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ అండర్సన్‌కు 150వది. దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో 150వ టెస్ట్ మ్యాచ్ ఆడిన తొలి బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇప్పటివరకు ఏ బౌలర్ కూడా 150 టెస్ట్ మ్యాచ్‌లు ఆడలేదు. షేన్ వార్న్ (145), ముత్తయ్య మురళీధరన్ (133), అనిల్ కుంబ్లే (132), గ్లెన్ మెక్‌గ్రాత్ (124) లాంటి దిగ్గజాలకు సాధ్యం కాని రికార్డును 37 ఏళ్ల జేమ్స్‌ అండర్సన్‌ అందుకున్నాడు.

ఒక పేస్ బౌలర్ 150 టెస్ట్ మ్యాచ్‌లు ఆడడం విశేషం. పేస్ బౌలర్లలో అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన జాబితాలో స్టువర్ట్ బ్రాడ్ (136) రెండవ స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్ మాజీ పేసర్ కోర్ట్నీ వాల్ష్ (132) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. 150 టెస్టులు ఆడిన రెండో ఇంగ్లీష్ క్రికెటర్‌గా జిమ్మీ రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ (161) మాత్రమే అండర్సన్‌ కంటే ముందున్నాడు.

Story first published: Thursday, January 9, 2020, 13:39 [IST]
Other articles published on Jan 9, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+