38 ఏళ్ల వయసులోనూ అదరగొడుతూ.. 1000వ వికెట్ తీసిన ఇంగ్లండ్ స్టార్ బౌలర్!!

లండన్: ఇంగ్లండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్, స్వింగ్ కింగ్ జేమ్స్ అండర్సన్ 38 ఏళ్ల వయసులోనూ అదరగొడుతున్నాడు. వయసుతో సంబంధం లేకుండా.. వికెట్ల వేటే లక్ష్యంగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే జిమ్మీ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 1000 వికెట్లు తీసిన బౌలర్‌గా అండర్సన్ చరిత్ర సృష్టించాడు.
ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లో భాగంగా సోమవారం కెంట్, లాంకషైర్ మధ్య జరిగిన కౌంటీ మ్యాచ్‌లో జిమ్మీ ఈ ఘనత అందుకున్నాడు. పిచ్ పేస్ బౌలింగ్‌కు అనుకూలిస్తుండటంతో.. అండర్సన్ ఏకంగా ఏడు వికెట్లు తీశాడు. కెంట్ బ్యాట్స్‌మన్ హీనో కుహ్న్ను ఔట్ చేసి తన ఖాతాలో 1000వ ఫస్ట్‌క్లాస్ వికెట్‌ను వేసుకున్నాడు.

ఏకంగా 7 వికెట్లు:
కెంట్‌తో జరిగిన మ్యాచ్‌లో లాంకషైర్ తరఫున ఆడుతున్న జేమ్స్ అండర్సన్ ఏకంగా 7 వికెట్లు తీసి సత్తాచాటాడు. అండర్సన్ దెబ్బకు కెంట్ 34 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. చివరకు 74 పరుగులకే ఆలౌట్ అయింది. (10-5-19-7)తో అత్యుత్తమ గణాంకాలతో మెరిసిన అండర్సన్.. జాక్ క్రాలే, జోర్డాన్ కాక్స్, ఓలీ రాబిన్‌సన్, హీనో కుహ్న్, జాక్ లీనింగ్, మాట్ మిల్నెస్, హ్యారీ పొడ్రమ్‌ల వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో ముగ్గురు డకౌట్లుగా వెనుదిరగడం విశేషం. అనంతరం లంకాషైర్ ఇన్నింగ్స్ కూడా తడబాటుతోనే ప్రారంభమైంది. రెండో రోజు ముగిసేసరికి 40 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది.

ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టులు:
జూన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌తో అలిస్టర్ కుక్‌ను వెనక్కి నెట్టిన జేమ్స్ అండర్సన్ ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టులు ఆడిన ప్లేయర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 162 టెస్టు మ్యాచ్‌లు ఆడిన జిమ్మీ 617 వికెట్లు తీశాడు. ఐదు వికెట్ల ప్రదర్శన 30సార్లు చేశాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ 161 టెస్టులతో రెండో స్థానంలో ఉన్నాడు. కుక్ 12472 పరుగులు చేశాడు. కుక్ తర్వాత స్టువర్ట్ బ్రాడ్ 148 టెస్టులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. బ్రాడ్ 523 వికెట్లు పడగొట్టటాడు. ఇక టెస్టుల్లో 600 వికెట్లకు పైగా తీసిన ఫాస్ట్ బౌలర్లలో అండర్సన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

కౌంటీ క్రికెట్‌లో బిజీగా:
2003లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన జేమ్స్ అండర్సన్.. ఇప్పటివరకు 616 వికెట్లు తీశాడు. అందులో 27సార్లు నాలుగు వికెట్ల ఘనతను, 30సార్లు ఐదు వికెట్ల హాల్స్ అందుకున్నాడు. షార్టెస్ట్ ఫార్మాట్‌లో 194 వన్డేలు 19 టీ20లు ఆడిన జిమ్మీ.. 50 ఓవర్ల ఫార్మాట్‌లో 269 వికెట్లు, పొట్టి క్రికెట్‌లో 18 వికెట్లు తీశాడు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్‌లో బిజీగా ఉన్న అండర్సన్ ఆ తర్వాత భారత్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. భారత్‌లో జరిగిన టెస్టు సిరీస్ ఓటమికి అండర్సన్ ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తున్నాడు. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఆగస్టు 4 నుంచి ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications