చెలరేగిన వోక్స్.. 185 పరుగులకే లంక ఆలౌట్! ఐదుగురు ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగినా నో యూజ్!!

చెస్టర్లీ స్ట్రీట్: టీ20 సిరీస్‌లో ఘోర పరాజయాలు ఎదుర్కొన్న శ్రీలంక.. ఫార్మాట్ మారినా ఆ జట్టు ఆట తీరులో మాత్రం ఏ మార్పు రాలేదు. టీ20ల్లో మాదిరే వన్డేల్లోనూ పేలవ ఫామ్‌ను కొనసాగించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం ఆతిధ్య ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో 185 పరుగులకే ఆలౌట్ అయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను ఇంగ్లండ్ స్టార్ పేసర్ క్రిస్ వోక్స్ వణికించాడు. వరుసపెట్టి వికెట్లు తీస్తూ లంక బ్యాట్స్‌మన్‌ను బెంబేలెత్తించాడు. వోక్స్ దెబ్బకు 145 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన లంక.. ఆ తర్వాత కోలుకోలేకపోయింది.

185 పరుగులకే లంక ఆలౌట్:
మరోవైపు డేవిడ్ విల్లీ కూడా అద్భుత బంతులతో శ్రీలంకను ఓ ఆటాడుకున్నాడు. ఇద్దరూ కలిసి పోటీపడి మరీ వికెట్లు తీయడంతో 42.3 ఓవర్లలో 185 పరుగులకే శ్రీలంక ఇన్సింగ్స్ ముగిసింది. కెప్టెన్ కుశాల్ పెరీరా (73), వహిందు హసరంగ (54) మాత్రమే ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కొని క్రీజులో నిలబడ్డారు. ఈ ఇద్దరు అర్ధ శతకాలు చేయడంతో లంక ఆ మాత్రం స్కోర్ అయినా చేసింది. లంక ఇన్నింగ్స్‌లో వీరితో పాటు చమిక కరుణరత్నే (19 నాటౌట్) ఒక్కడే రెండంకెల స్కోర్ అందుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 4, డేవిడ్ విల్లీ 3, మొయిన్ అలీ ఒక వికెట్ పడగొట్టారు.

విజయం దిశగా ఇంగ్లండ్:
అనంతరం బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ విజయం దిశగా దూసుకెళుతోంది. 26 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 44 రన్స్ అవసరం. క్రీజులో జో రూట్ (54), మొయిన్ అలీ (17) ఉన్నారు. అయితే 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లీష్ జట్టు కూడా ఆదిలో తడబడింది. ఓపెనర్ లియామ్ లివింగ్‌స్టోన్ (9), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (6), సామ్ బిల్లింగ్స్ (3) విఫలం అయ్యారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా జానీ బెయిర్‌స్టో (21 బంతుల్లో 43; 6 ఫోర్లు, సిక్స్) తనదైన శైలిలో అలరించి పెవిలియన్ చేరాడు. రూట్ మాత్రం క్రీజులో పట్టుకుపోయాడు. అతడికి అలీ అండగా ఉన్నాడు.

ఏకంగా ఐదుగురు ఆల్‌రౌండర్లతో:
మూడు వన్డేల సిరీస్ కోసం డర్హమ్‌కు వచ్చిన లంక ఆటగాళ్లు.. అక్కడ ఏర్పాటు చేసిన బయో బబుల్ రూల్స్‌ను అధిగమించారు. దాంతో ఇంగ్లండ్ జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక ఒకే ఒక బ్యాట్స్‌మన్‌తో బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిస్సంక, పెరీరా మినహా ఎవరూ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ కాదు. రూల్స్ అతిక్రమణతో పలువురు బ్యాట్స్‌మన్ సేవలు కోల్పోయిన లంక.. ఏకంగా ఐదుగురు ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగింది. అయినా ఫలితం మాత్రం దక్కలేదు.

మాజీల విచారం:
శ్రీలంక వైస్ కెప్టెన్ కుశాల్ మెండిస్, వికెట్ కీపర్ నిరోషాన్ డిక్వెల్లా, ఓపెనర్ దనుష్క గుణతిలక బయో బబుల్ నిబంధనల్ని అతిక్రమించిన విషయం తెలిసిందే. మరికొద్ది నెలల్లో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఆ జట్టు ఇలా విఫలమవుతుండటంపై పలువురు మాజీలు తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఇప్పటికే పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని, వెంటనే తగు చర్యలు తీసుకొని జట్టును కాపాడాలని మాజీ కెప్టెన్ సన్‌త్ జయసూర్య ఆదివారం ట్వీట్ చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications