Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లాండ్‌కు దెబ్బ మీద దెబ్బ: గాయంతో హేల్స్‌ ఇంటికి

హైదరాబాద్: వన్డే సిరిస్‌ను 0-2తో కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ ఓపెనర్ అలెక్స్‌ హేల్స్‌ గాయంతో ఇంటిముఖం పట్టాడు. కటక్‌లోని బారాబతి స్టేడియంలో గురువారం జరిగిన రెండో వన్డేలో హేల్స్ కుడి చేతికి గాయమైంది. రెండో వన్డేలో ఇంగ్లాండ్‌పై భారత జట్టు 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇచ్చిన క్యాచ్ పట్టే సమయంలో అతడి కుడి చేతికి గాయమైంది. దీంతో అతడు కోల్‌కతాలో జరగనున్న మూడో వన్డేతో పాటు ఆ తర్వాత జరిగే టీ20 సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. 28 ఏళ్ల హేల్స్ శనివారం నాడు స్వదేశానికి బయల్దేరనున్నాడు.

England opener Alex Hales' India tour ends with fractured hand

ఇదిలా ఉంటే ఆదివారం జరగనున్న మూడో వన్డేలో హేల్స్ స్ధానంలో శ్యామ్ బిల్లింగ్స్ ఓపెనింగ్‌ స్ధానంలో బరిలోకి దిగనున్నాడు. మరోవైపు టీ20 సిరీస్‌ కోసం హేల్స్‌ స్థానంలో జానీ బెయిస్ స్టోని ఇంగ్లాండ్‌ బోర్డు భారత్‌కు పంపనుంది. మూడు వన్డేల సిరిస్‌ను ఇంకో వన్డే మిగిలుండగానే 0-2తో టీమిండియా కైవసం చేసుకుంది.

కటక్ వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లాండ్ మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానాను విధిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురవారం ఓ ప్రకటనలో పేర్కొంది. మరొవైపు స్లో ఓవర్ రేట్‌కు కారణమైన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పడింది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+