Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

England Vs Newzealand 1st Test: తన కెప్టెన్సీ ఎలా ఉంటుందో చెప్పిన స్టోక్స్.. ప్లేయింగ్ 11టీంలు ఇవే..!

England New Test Captain Ben Stokes about Captaincy: Excited To Play Under Brendon Mccullum As Coach

Lord's : ఇంగ్లాండ్ నూతన టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. కొత్త కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్‌ మార్గదర్శకత్వంలో ఆడడానికి ఎక్సయిటింగ్‌గా ఉన్నట్లు పేర్కొన్నాడు. లార్డ్స్‌లో ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ ఈ రోజు ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్లో 17 టెస్ట్‌లలో ఒక్కటి మాత్రమే గెలిచిన ఇంగ్లాండ్.. పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది.

ఇక ఈ సిరీస్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఇంగ్లాండ్ భావిస్తుంది. ఈ సిరీస్ గెలిచి తప్పకుండా.. టెస్టు ఛాంపియన్ షిప్ రేసులో నిలవాలని ఉవ్విళ్లూరుతుంది. గురువారం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3గంటలకు క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్‌లో ప్రారంభం కాబోయే మ్యాచ్‌కు ముందు బెన్ స్టోక్స్ విలేకరులతో మాట్లాడాడు.

జట్టులోని అందరికి నేను చెప్పేదొక్కటే

జట్టులోని అందరికి నేను చెప్పేదొక్కటే

'ఇప్పుడు ఉన్న జట్టు సభ్యులతో నేను చెప్పేదొక్కటే. మీకు నా నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. ఇది మీ టైం. ఇకపై మన జట్టు ఎలా ముందుకెళ్లాలో మనం నిర్దేశించుకుందాం. నా కెప్టెన్సీలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ సిరీస్‌కు ముందు బ్రెండన్‌ మెక్కల్లమ్‌తో కలిసి పని చేయడం చాలా మంచి అనుభవం.

మెక్కల్లమ్ ప్రతిఒక్కరూ సొంతంగా, స్వతహాగా తమను తాము మెరుగుపరిచేలా శిక్షణ ఇస్తాడు. ఇప్పటికే మా ఆటగాళ్లలో తన మోటివేషన్‌తో ఎనలేని ఉత్తేజాన్ని నింపాడు. పూర్తి స్థాయి కెప్టెన్‌గా వ్యవహరించడానికి నాకు ఎలాంటి బెరుకు లేదు. చెప్పాలంటే నేను చాలా ఎక్సయిటింగ్‌గా ఉన్నాను.' అని స్టోక్స్ పేర్కొన్నాడు.

స్టేడియంలో అభిమానులు లేకుంటే అంతా బాగోదు

స్టేడియంలో అభిమానులు లేకుంటే అంతా బాగోదు

ఇటీవల ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు లార్డ్స్‌లో టిక్కెట్‌ల ధరలు అమాతం పెంచడంతో.. లార్డ్స్‌లో జరగబోయే ఐదు రోజుల టెస్ట్‌లో ఇంకా 16,000కు పైగా టికెట్లు అమ్ముడుపోలేదు. ధరలు పెంచడాన్ని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌ తీవ్రంగా తప్పుపట్టగా.. స్టోక్స్ కూడా ఈ విషయమై ప్రశ్నలు రేకెత్తించాడు 'టికెట్ ధరల విషయమై బోర్డు కాస్త ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరముంది.'

స్టేడియంలో అభిమానులు లేకుండా క్రికెట్ అంతా బాగోదు. నేను టిక్కెట్ ధరలను నిర్ణయించలేను. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. కచ్చితంగా ఈ విషయమై బోర్డు కాస్త పరిశీలించాలని మాత్రం కోరుకుంటాను' అని స్టోక్స్ పేర్కొన్నాడు.

మాథ్యు పాట్స్, ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ తుదిజట్టులోకి

మాథ్యు పాట్స్, ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ తుదిజట్టులోకి

ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తరఫున కౌంటీల్లో డర్హామ్ జట్టు తరఫున రాణించిన పేస్ బౌలర్ మాథ్యూ పాట్స్ అరంగేట్రం చేయనున్నాడు. ఈ ఏడాది కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఒక్కొక్కటి 18.57 సగటుతో 35 వికెట్లతో పాట్స్ ఆకట్టుకున్నాడు. అలాగే సీనియర్ ప్లేయర్లైన జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌ కూడా జట్టులో చేరారు.

జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్‌ సహా ఆరుగురు ఇంగ్లాండ్ పేస్ బౌలర్లు గాయం వల్ల జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక ఈ టెస్టు మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ ఇప్పటికే తుది జట్టును ప్రకటించింది. కాగా న్యూజిలాండ్ మాత్రం తన స్క్వాడ్ ప్రకటించిన ప్లేయింగ్ 11ను మాత్రం ప్రకటించలేదు. ఇక ఈ మ్యాచ్‌కు వాన ముప్పు కూడా పొంచి ఉంది.

ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 టీం:

ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 టీం:

అలెక్స్ లీస్, జాక్ క్రాలే, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), మాథ్యూ పాట్స్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, జేమ్స్ ఆండర్సన్

న్యూజిలాండ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11టీం:

విల్ యంగ్, టామ్ లాథమ్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, కొలిన్ డి గ్రాండ్‌హోమ్, కైల్ జామీసన్, టిమ్ సౌతీ, నీల్ వాగ్నర్, అజాజ్ పటేల్/మాట్ హెన్రీ

Story first published: Thursday, June 2, 2022, 13:41 [IST]
Other articles published on Jun 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+