న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

న్యూజిలాండ్ పర్యటనలో అండర్సన్, బెయిర్‌స్టోలకు దక్కని చోటు.. కొత్తవారికి అవకాశం

England name T20I and Test squads for New Zealand tour, Jonny Bairstow dropped from Test side

హైదరాబాద్: ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు జేమ్స్ అండర్సన్, జానీ బెయిర్‌స్టోలకు సెలెక్టర్లు మొండిచేయి చూపారు. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు నవంబర్ 21 నుంచి ఐదు టీ20 మ్యాచ్‌లు, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనున్నాయి. ఈ పర్యటన కోసం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సెలెక్టర్లు సోమవారం 15 మంది సభ్యులతో కూడిన రెండు జట్లను ప్రకటించారు. చిరస్మరణీయ ఐసీసీ ప్రపంచకప్ 2019 గెలిచిన తర్వాత పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఇంగ్లీష్ కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్ తిరిగి జట్టుకు సారధ్య భాద్యతలు చేపట్టనున్నాడు. జో రూట్ టెస్ట్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు.

ఐసీసీ కంటే ముందే బౌండరీ రూల్‌ను మార్చేసిన 'సీఏ'.. బీబీఎల్‌తో అమలుఐసీసీ కంటే ముందే బౌండరీ రూల్‌ను మార్చేసిన 'సీఏ'.. బీబీఎల్‌తో అమలు

అయితే ఇంగ్లాండ్ సెలెక్టర్లు స్టార్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌ జానీ బెయిర్‌స్టోను టెస్ట్ జట్టు నుంచి తప్పించారు. అయితే ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు మాత్రం ఎంపిక చేశారు. సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ కూడా టెస్ట్ జట్టులో చోటు కోల్పోయాడు. యాషెష్ సిరీస్‌లో గాయపడిన అండర్సన్ పూర్తిగా కోలుకోకపోవడంతో సెలెక్టర్లు అతడి విశ్రాంతిని కొనసాగించారు. టామ్ బాంటన్, సాకిబ్ మహమూద్ తొలిసారి టీ20 జట్టులో స్థానం సంపాదించారు. వైటాలిటీ బ్లాస్ట్‌లో సోమెర్‌సెట్ తరపున ఆడిన బాంటన్ 549 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో బాబర్ అజామ్ తరువాత అత్యధిక పరుగులు చేసాడు. రాయల్ లండన్ వన్డే కప్‌లో మహమూద్ అద్భుత ఆటతో సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు.

వారితో పాటు సీమర్ పాట్ బ్రౌన్, స్పిన్నర్ మాథ్యూ పార్కిన్సన్ కూడా తొలిసారి జట్టులోకి వచ్చారు. సాకిబ్ మహమూద్, మాట్ పార్కిన్సన్, డొమినిక్ సిబ్లీ కూడా టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నారు. జో డెన్లీ, సామ్ కుర్రాన్, మహమూద్, పార్కిన్సన్ మాత్రమే రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు. అయితే బ్లాక్‌క్యాప్స్‌తో జరిగే రెండు టెస్టులు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగం కావు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన యాషెష్ సిరీస్‌ను ఇంగ్లాండ్ 2-2తో సమం చేసిన విషయం తెలిసిందే. ప్రపంచకప్ విజయం అనంతరం ఇంగ్లాండ్ నేరుగా యాషెష్ సిరీస్‌ మాత్రమే ఆడింది.

England T20I squad:
Eoin Morgan (captain), Jonny Bairstow (wicketkeeper), Tom Banton, Sam Billings, Pat Brown, Sam Curran, Tom Curran, Joe Denly, Lewis Gregory, Chris Jordan, Saqib Mahmood, Dawid Malan, Matt Parkinson, Adil Rashid.

Joe Root (captain), Jofra Archer, Stuart Broad, Rory Burns, Jos Buttler, Zak Crawley, Sam Curran, Joe Denly, Jack Leach, Saqib Mahmood, Matthew Parkinson, Ollie Pope, Dominic Sibley, Ben Stokes, Chris Woakes.

Story first published: Tuesday, September 24, 2019, 16:03 [IST]
Other articles published on Sep 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X