For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సాల్ట్ ఫిల్ చేశాడు: టీ20లో ఎన్ని అద్భుతాలు జరగాలో.. అన్నీ జరిగాయి

ఇంగ్లాండ్ చరిత్ర నెలకొల్పింది. అసాధ్యం అనుకున్న దాని సుసాధ్యం చేసింది. టీ20 ఇంటర్నేషనల్స్ లో 300 పరుగులకు పైగా స్కోర్ సాధించింది. దక్షిణాఫ్రికా బౌలింగ్ ను చీల్చి చెండాడింది. అదే స్థాయిలో బౌలింగ్ లోనూ మెరుపులు మెరిపించిందా ఇంగ్లీష్ టీమ్. ఏకంగా 146 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓ టీ20 మ్యాచ్ లో ఎన్ని అద్భుతాలు జరగాలో.. అన్నీ జరిగిపోయాయి ఈ మ్యాచ్ లో. బ్యాటింగ్, బౌలింగ్ లో ఎదురులేదనిపించుకుంది.

శుక్రవారం రాత్రి ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో దక్షిణాప్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లల్లో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఏకంగా 304 పరుగులు చేసింది. తొలి ఓవర్ నుంచే బౌలర్లపై విరుచుకుపడ్డారు ఓపెనర్లు ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్. ఆకాశమే హద్దుగా చెలరేగారు. భారీ సిక్సర్లు, బుల్లెట్ల వంటి ఫోర్లతో మెరుపులు మెరిపించారు. గుక్క తిప్పుకోనివ్వని, చూపు మరల్చుకోనివ్వని బ్యాటింగ్ తో ధ్వంస రచన సాగించారు.

England mayhem against SA as Phil Salt sets new high in 2nd T20I

ఈ క్రమంలో ఫిల్ సాల్ట్ 60 బంతుల్లో 141 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 15 ఫోర్లు, ఎనిమిది భారీ సిక్సులు ఉన్నాయి. మరో ఓపెనర్ జోస్ బట్లర్ కూడా అదే రేంజ్ లో ఆడాడు. 30 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్సర్లతో 83 పరుగులు బాదాడు. జాకబ్ బేథెల్- 26, కేప్టెన్ హ్యారీ బ్రూక్- 21 బంతుల్లో 41 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. వీరి బ్యాటింగ్ రేంజ్ ఏ స్థాయిలో ఉందంటే.. మెరికల్లాంటి దక్షిణాఫ్రికా బౌలర్లు ఒక్కో ఓవర్ కు 15 చొప్పున పరుగులను సమర్పించుకోవాల్సి వచ్చింది.

మార్కో జెన్ సెన్- 60, కగిసొ రబడ- 70, లిజాడ్ విలియమ్స్- 62, జోర్న్ ఫర్ట్యూన్- 52, క్వెనా ఎంఫాకా- 41, ఎయిడెన్ మార్క్ రమ్ ఒక్క ఓవర్ కే 19 పరుగులు ఇచ్చుకున్నారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా ఏ మాత్రం పోరాడలేకపోయింది. 16.1 ఓవర్లల్లో 158 పరుగులకే ఆలౌట్ అయింది.

కేప్టెన్ ఎయిడెన్ మార్క్ రమ్ ఒక్కడే టాప్ స్కోరర్. 20 బంతుల్లో 41 పరుగులు చేశాడీ ఓపెనర్. రియాన్ రికెల్టన్- 20, ప్రిటోరియస్- 2, డెవాల్డ్ బ్రేవిస్- 4, ట్రిస్టన్ స్టబ్స్- 23, డొనొవన్ ఫెర్రీరా- 23, మార్కో జెన్ సెన్- 0, జోర్న్ ఫొర్ట్యూన్- 32, కగిసొ రబడ- 9, క్వెనా ఎంఫాకా- 0, పరుగులు చేశారు.

ఈ మ్యాచ్ లో ఎన్నో రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. కొత్తవి మొలకెత్తాయి. 146 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఇది ఆ జట్టు టీ20 చరిత్రలో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన మ్యాచ్‌గా నిలిచింది.

ఫిల్ సాల్ట్.. సాల్ట్ అజేయంగా 141 పరుగులు చేసి ఇంగ్లాండ్ తరఫున ఫాస్టెస్ట్, హయ్యెస్ట్ టీ20 సెంచరీని నమోదు చేశాడు.

టీ20 ఇంటర్నేషనల్స్ లో 300 పరుగులు దాటడం ఇది మూడోసారి. ఇదివరకు జింబాబ్వే- గాంబియా మ్యాచ్ లో 344, నేపాల్- మంగోలియా గేమ్ లో 314 పరుగులు నమోదయ్యాయి.

బట్లర్ 30 బంతుల్లో 83 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఇందులో 18 బంతుల్లోనే అర్ధ సెంచరీని అందుకున్నాడు. ఇది ఇంగ్లాండ్ తరఫున మూడో హాఫ్ సెంచరీ.

Story first published: Saturday, September 13, 2025, 7:51 [IST]
Other articles published on Sep 13, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+