భారత్-ఎ, ఇంగ్లండ్ లయన్స్ మ్యాచ్ డ్రా

హైదరాబాద్: భారత్-ఎ, ఇంగ్లాండ్ లయన్స్ మధ్య తొలి అనధికారిక టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఓవర్‌నైట్ స్కోరు 20/0తో ఆఖరి రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ 82 ఓవర్లలో 5 వికెట్లకు 214 పరుగులు చేసింది. ఓపెనర్లు బెన్ డకెట్(30), మ్యాక్స్ హోల్డెన్ (29) లయన్స్‌కు మెరుగైన శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని 12 ఓవర్లలో 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేసిన భారత 'ఎ' బ్యాట్స్‌మన్ ప్రియాంక్ పాంచల్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 340 పరుగులు చేయగా.. భారత్-ఎ 540/6 స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ సిరిస్‌లో రెండు జట్ల మధ్య రెండో అనధికారిక టెస్టు ఈనెల 13న మైసూర్‌లో ప్రారంభమవుతుంది.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్ లయన్స్ తొలి ఇన్నింగ్స్: 340;
భారత్ 'ఎ' తొలి ఇన్నింగ్స్: 540/6 డిక్లేర్డ్;
ఇంగ్లాండ్ లయన్స్ రెండో ఇన్నింగ్స్: 214/5 (83 ఓవర్లలో) (ఒలివర్ పోప్ 63, సామ్యూల్ హైన్ 57, డకెట్ 30, హోల్డెన్ 29; జలజ్ సక్సేనా 2/41).
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications