Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Eng vs Nz 3rd test : ఇంగ్లాండ్‌కు ఊపు ఆగుతాలేదేమో..! టెస్ట్ అంటే టెస్ట్‌లాగే ఆడాలి లేకుంటే గిట్లనే ఉంటది

England Hitting Formulae Failed as Trent Boult Strikes with 3 Bowled Wickets

ఇంగ్లాండ్‌తో లీడ్స్‌లోని హెడింగ్లీలో జరిగిన చివరి టెస్టులో డారిల్ మిచెల్ సెంచరీతో (109పరుగులు 228బంతుల్లో 3ఫోర్లు) చెలరేగడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 329పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్.. విజయగర్వం తలకెక్కిందా అన్న డౌట్ వచ్చేలా ఆడింది. సెకండ్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ధనధన్ ఇన్నింగ్స్ ఆడి గెలిచిన సంగతి తెలిసిందే. ఇక అదే ఊపు ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాలని చూసినట్లుంది. కానీ ఆ ప్రయోగం బెడిసికొట్టింది.

బౌల్ట్ దెబ్బకు క్రీజులో నిలబడలేకపోయిన బ్యాటర్లు

బౌల్ట్ దెబ్బకు క్రీజులో నిలబడలేకపోయిన బ్యాటర్లు

ఇక రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు దిగి హిట్టింగ్ ధోరణిలో మ్యాచ్ ఆడాలనుకున్న ఇంగ్లాండ్‌కు న్యూజిలాండ్ బౌలర్లు ఖతర్నాక్ షాకిచ్చారు. నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లాండ్‌ను ముప్పు తిప్పలు పెట్టారు. బౌల్ట్, సౌథీ, వాగ్నర్ దెబ్బకు ఆ జట్టు బ్యాటర్లు అలెక్స్ లీస్ (4), జాక్ క్రౌలీ (6), ఓలీ పోప్ (5), జో రూట్ (5), బెన్ స్టోక్స్ (18), బెన్ ఫోక్స్ (0).. 12ఓవర్లు పూర్తి కాకుండానే పెవిలియన్ బాటపట్టారు. ఇక బౌల్ట్ తన తొలి స్పెల్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్లను వణికించారు. అలెక్స్ లీస్, జాక్ క్రౌలీ, ఓలీ పోప్‌లను బౌల్డ్ చేశాడు. అతని దెబ్బకు ఇంగ్లాండ్ బ్యాటర్లు క్రీజులో కూడా నిలబడలేకపోయారు.

అందుకే టెస్ట్‌ను టెస్ట్‌లాగా ఆడాలి

అందుకే టెస్ట్‌ను టెస్ట్‌లాగా ఆడాలి

ఇక మళ్లీ తుది జట్టులోకి వచ్చిన నీల్ వాగ్నర్ కూడా రెచ్చిపోయి బౌలింగ్ చేశాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను, వికెట్ కీపర్ బెన్ ఫోక్స్‌ను పెవిలియన్ పంపించాడు. ఇక ఇంగ్లాండ్ జట్టు వాల్ అయిన జో రూట్‌ను సౌతీ బుట్టలో వేసుకున్నాడు. ఇక 21పరుగులకే 4వికెట్లు పడిపోయిన ఇంగ్లాండ్.. 55 పరుగులకే 6వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక రెండో టెస్ట్ హీరో జానీ బెయిర్ స్టో(43పరుగులు 48బంతుల్లో), జేమీ ఓవర్టన్ (24పరుగులు 34బంతుల్లో) క్రీజులో ఉండి ఇన్నింగ్స్ నడిపిస్తున్నారు. ఇకపోతే టెస్ట్‌ను టెస్ట్‌లాగా ఆడాలి కానీ.. ఇలా ప్రత్యర్థులను భయపెట్టించేందుకు ఎటాకింగ్ గేమ్ ఆడితే కుదరదు అనేదానికి నిదర్శనంగా ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ నిలిచింది. తగినన్ని బంతులు ఎదుర్కొని కుదురుకోకుండాని ఎడాపెడా హిట్టింగ్ చేయాలని ఇంగ్లాండ్ బ్యాటర్లు చూడడంతో వారి పతనాన్ని వారే కొని తెచ్చుకున్నట్లయింది.

అంతకుముందు సెంచరీతో చెలరేగిన డారిల్ మిచెల్

అంతకుముందు సెంచరీతో చెలరేగిన డారిల్ మిచెల్

ఇకపోతే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలి రోజు 5 వికెట్ల నష్టానికి 225పరుగులు చేసింది. ఇక రెండో రోజు మరో 104పరుగులు చేసి ఇన్నింగ్స్ ముగించింది. 78పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో క్రీజులో అడుగిడిన డారిల్ మిచెల్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. ఇక జాక్ లీచ్ బౌలింగ్‌లో సిక్సర్‌తో వరుసగా మూడు టెస్టుల్లో మూడు సెంచరీలు నమోదు చేశాడు. టామ్ బ్లండెల్‌ (55)తో 6వికెట్‌కు 120పరుగుల భాగస్వామ్యం అందించాడు. ఇక చివర్లో సౌతీ (33) సైతం రాణించాడు. దీంతో ఇంగ్లాండ్ 329పరుగులు చేయగలిగింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో జాక్ లీచ్ 5వికెట్లతో చెలరేగాడు. ఇక సీనియర్ అయిన స్టువర్ట్ బ్రాడ్ 3వికెట్లు తీయగా.. మ్యాటీ పాట్స్, జేమీ ఓవర్టన్ తలా ఒక వికెట్ తీశారు.

Story first published: Friday, June 24, 2022, 21:28 [IST]
Other articles published on Jun 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+