
హైదరాబాద్: మరి కొద్ది గంటల్లో ఐర్లాండ్‌తో పోటీగా బరిలోకి దిగనున్నటీమిండియా ప్రాక్టీసు ముగించుకుని మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు తీవ్రమైన స్థాయిలో ప్రాక్టీసులో పాల్గొన్నారు. దీంతో పాటుగా మున్ముందు జరగనున్న ఇంగ్లాండ్ పర్యటన గురించి భారత బౌలర్ చాహల్ ఇలా స్పందించాడు. 'ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాపై 480 పరుగులు చేయగలదు. కానీ, టీమిండియాపై కాదు' అని అన్నాడు భారత క్రికెటర్ చాహల్.
ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్ గురించి.. చాహల్ మాట్లాడుతూ...'ఇంగ్లాండ్ పర్యటనలో రెండు రకాల అస్త్రాలు ఉన్నాయి. అవే గూగ్లీలు. ఈ రెండింటినీ కలిపి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందుల్లో పడేస్తా. ఎడంచేతి ఆర్మ్ స్పిన్నర్ రెండు రకాలుగా మాత్రమే బంతులేయగలడు. కానీ, లెగ్ స్పిన్నర్ నాలుగు రకాలుగా బంతులేయవచ్చు. దీంతో బ్యాట్స్‌మెన్ నేను ఏ విధంగా బంతిని వేస్తానా అని ఆలోచనలో పడతాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుతం మణికట్టు స్పిన్నర్ల హవా నడుస్తోంది. మణికట్టు స్పిన్నర్లు లేని జట్లు విజయాలు సాధించలేకపోతున్నాయి.'
'ఇంగ్లాండ్ పరిస్థితులు స్పిన్నర్లకే అనుకూలంగా ఉన్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్ స్పిన్నర్లకే ఎక్కువ వికెట్లు దక్కాయి. ఇది మాకు కలిసొచ్చే అంశం. ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ 400కు పైగా స్కోరు నమోదు చేయగలదేమో.. టీమిండియాపై కాదు' అని చాహల్ అన్నాడు.
'ప్రతి పర్యటన మాకెంతో ముఖ్యం. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు రావడం ఇదే మొదటిసారి. నేను, కుల్‌దీప్ కలిసి మధ్య ఓవర్లలో బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టాలి. అప్పుడే ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెరుగుతోంది. లండన్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేశాను. ప్రస్తుతం ఇక్కడి వాతావరణం వేడిగా ఉంది. స్వదేశంలో ఎలా ఉందో అలాగే ఉంది. ఇవే పరిస్థితులు కొనసాగితే.. భారత్‌కు సులభంగా విజయాలు దక్కే అవకాశం ఉంది' అని చాహల్ నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.