Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జో రూట్ వచ్చేశాడు.. విజయంపై కన్నేసిన ఇంగ్లండ్!!

England get boost as captain Joe Root returns as West Indies eye series win

లండన్: వెస్టిండీస్​తో రెండో టెస్టు కోసం ఇంగ్లండ్ రెగ్యులర్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ జట్టుతో కలవనున్నాడు. తన భార్య రెండో సంతానానికి జన్మనివ్వడంతో తొలి టెస్టుకు (సౌథాంప్టన్ టెస్ట్) దూరమైన రూట్..​ గురువారం నుంచి జరిగే రెండో మ్యాచ్​కు కోసం సిద్ధమ్యాడు. అయితే జట్టుతో చేరే ముందు జో రూట్‌కి కరోనా వైరస్ పరీక్షలు చేస్తామని గతంలోనే ఈసీబీ ప్రకటించింది. దీంతో వైరస్ టెస్టుల అనంతరం రూట్ జట్టుతో కలవనున్నాడు.

తొలి టెస్టులో జో రూట్ లేని లోటు ఇంగ్లండ్ జట్టులో కనిపించింది. అంచనాలు లేకుండా బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆతిథ్య ఇంగ్లండ్​ను నాలుగు వికెట్ల తేడాతో చిత్తుచేసి షాకిచ్చింది. కాగా మూడు టెస్టుల సిరీస్​లో రెండో మ్యాచ్​ గురువారం నుంచి ఓల్డ్ ట్రఫోర్డ్ వేదికగా జరుగనుంది. రూట్​ రాకతో ఇంగ్లండ్ మళ్లీ ఫామ్​లోకి రావాలని పట్టుదలగా ఉంది. రూట్ జట్టుతో కలవనున్న నేపథ్యంలో ఇంగ్లండ్ బలం రెట్టింపవ్వనుంది. కెప్టెన్, బ్యాట్స్‌మన్‌గా రూట్ తన మార్క్ చూపెట్టనున్నాడు.

కరోనా వైరస్ కారణంగా దాదాపు నాలుగు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్ నిలిచిపోగా.. వెస్టిండీస్​-ఇంగ్లండ్ సిరీస్​తో పునఃప్రారంభమైంది. తొలి టెస్టులో విండీస్ సమిష్టి ప్రదర్శనతో ఇంగ్లండ్​ ఖంగుతినింది. మరో మ్యాచ్ గెలిచి సిరీస్​ను పట్టేయాలని జేసన్ హోల్డర్ సారథ్యంలోని వెస్టిండీస్​ అనుకుంటుండగా.. పుంజుకొని స్వదేశంలో సిరీస్​ను నిలబెట్టుకోవాలని రూట్ సేన పట్టుదలగా ఉంది. ఇంగ్లీష్ జట్టు తుది టీంలో మార్పులు చేసే అవకాశం ఉంది. రూట్ సహా బ్రాడ్ కూడా ఆడనున్నాడు.

సౌథాంప్టన్ టెస్టులో జో రూట్‌ స్థానంలో కెప్టెన్‌గా వ్యవహరించిన బెన్ ‌స్టోక్స్.. పేలవ నిర్ణయాలతో ఇంగ్లండ్ ఓటమికి ప్రత్యక్షంగా కారణమయ్యాడు. టాస్ నుంచి తుది జట్టు ఎంపిక వరకూ అతని నిర్ణయాలపై విమర్శలు వచ్చాయి. టెస్టు ఆరంభానికి ముందు వర్షం పడే సూచనలు కనిపించినా.. టాస్ గెలిచిన ‌స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో సీనియర్ ఫాస్ట్ బౌలర్ బ్రాడ్‌‌పై వేటు వేయడం, కీలక క్యాచ్ జారవిరచడం, అలానే ఫీల్డింగ్ కూర్పులోనూ తేలిపోయాడు. మొత్తంగా కెరీర్‌లో తొలిసారి కెప్టెన్‌‌గా వ్యవహరించిన ‌స్టోక్స్ ఫెయిలయ్యాడు.

ఫామ్‌తో తంటాలు పడుతున్న ఇంగ్లీష్ వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌కు ఆ జట్టు ప్రధాన కోచ్‌ క్రిస్‌ సిల్వర్‌వుడ్‌ మద్దతుగా నిలిచాడు. అతడిని తుది జట్టు నుంచి తప్పించమని, విజయవంతం కావడానికి మరిన్ని అవకాశాలు ఇస్తామని చెప్పాడు. గత 15 ఇనింగ్స్‌లో కనీసం ఒక అర్ధ సెంచరీ కూడా చేయని బట్లర్‌.. తొలి టెస్టులో వెస్టిండీస్‌ను గెలిపించిన జెర్మయిన్‌ బ్లాక్‌వుడ్‌ క్యాచ్‌ను నేలపాలు చేశాడు. కెరీర్‌ను కాపాడుకోవడానికి బట్లర్‌కు మరో రెండు టెస్టులే ఉన్నాయని మాజీ ఆటగాడు డారెన్‌ గాఫ్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో సిల్వర్‌వుడ్‌ మద్దతుగా నిలిచాడు.

Story first published: Wednesday, July 15, 2020, 14:47 [IST]
Other articles published on Jul 15, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+