Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యాషెస్: ఇంగ్లాండ్ కలలు నీరైపోయాయ్

England frustrated by David Warner, Steve Smith and rain

హైదరాబాద్: సిరీస్ ఎలాగూ పోయింది. అలా అని వదిలేస్తే ఖాళీ చేతుల్తో తిరుగుప్రయాణం పట్టాల్సిందే. ఇదే ఉద్దేశ్యంతో పోరాడిందో ఏమో. ఇంగ్లాండ్ కొద్దిగా ఊపందుకుంది. యాషెస్ సిరీస్‌లోనే ఇప్పటి వరకు ఆధిపత్యం కొనసాగిస్తున్న ఆస్ట్రేలియాను తలకిందులు చేసింది ఇంగ్లాండ్ జట్టు. పరిస్థితులు అనుకూలిస్తున్నాయా అనుకుంటున్న తరుణంలో వరుణుడు వాతావరణం మార్పుతో వారి ఆశలు నీరుగార్చాడు.

నాలుగో టెస్టులో ఆ జట్టుకు విజయావకాశాలపై వర్షం ప్రభావం చూపింది. మొట్ట మొదటి సారిగా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 164 పరుగుల తేడాతో కీలక ఆధిక్యం సంపాదించింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులకే 2 వికెట్లు పడగొట్టడంతో ఆ జట్టుకు విజయంపై ఆశలు చిగురించాయి. అయితే నాలుగో రోజు మధ్యాహ్నం నుంచి వర్షం మొదలైంది. వస్తూ పోతూ ఉన్న వర్షంతో ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు.

లంచ్‌ విరామం తర్వాత ఆసీస్‌ 36.2 ఓవర్లలో 86/2తో ఉన్న దశలో వర్షం పడింది. శుక్రవారం ఆట ఆఖరుకు ఆ జట్టు 43.5 ఓవర్లలో 103/2తో నిలిచింది. వార్నర్‌ (40), స్టీవ్‌ స్మిత్‌ (25) క్రీజులో ఉన్నారు.
ఇంగ్లాండ్ అంతకుముందు 491/9తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించింది. కానీ, ఒక్క బంతే ఆడి అదే స్కోరు వద్ద ఇన్నింగ్స్‌‌ను ముగించింది. ఓపెనర్‌ కుక్‌ 244 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి చివరి వరకు అజేయంగా నిలిచిన ఓ ఇంగ్లాండ్‌ ఆటగాడిగా కుక్ అత్యధిక స్కోరు చేయడం విశేషం. ఆసీస్‌‌పై ఇంగ్లాండ్ 61 పరుగుల ఆధిక్యంతో ఉంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, December 30, 2017, 10:39 [IST]
Other articles published on Dec 30, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+