హైదరాబాద్: ఇంగ్లండ్, వెస్టిండిస్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా ప్రారంభమైన మూడో టెస్టు ఆసక్తికరంగా జరుగుతోంది. తొలి రోజు బౌలర్లు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దీంతో గురువారం బౌలర్లు 15 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండిస్ బ్యాటింగ్ ఎంచుకుంది.
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (6/22) విజృంభించడంతో వెస్టిండిస్ తొలి ఇన్నింగ్స్‌లో 123 పరుగులకే ఆలౌటైంది. కీరన్ పావెల్ (39) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓ దశలో 78/2తో మెరుగైన స్థితిలో ఉన్న వెస్టిండిస్‌ను బెన్ స్టోక్స్ తన అద్భుతమైన బౌలింగ్‌తో ఆరు వికెట్లు తీసి విండీస్ పతనాన్ని శాసించాడు.

ఇక జేమ్స్ ఆండర్సన్, రొలాండ్ జోన్స్ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 19 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. కుక్ (10), స్టోన్‌మన్ (1), రూట్ (1), వెస్లీ (8) పరుగులకే పెవిలియన్‌కు చేరారు.

ప్రస్తుతం క్రీజులో మలాన్(13), స్టోక్స్ (13) క్రీజులో ఉన్నారు. వెస్టిండిస్ బౌలర్లలో రోచ్, హోల్డర్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.