For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇండియాతో ఓడిపోయినా.. సంబరాల్లో ఇంగ్లాండ్

England Cricketers Celebrate Penalty Shootout Victory over Colombia at 2018 World Cup

హైదరాబాద్: ఇంగ్లాండ్ తో జరిగిన తొలి పోరులో భారత్‌ 8 వికెట్ల తేడాతో గెలిచింది. అయినా ఇంగ్లాండ్‌ క్రికెటర్లు సంబరాల్లో మునిగితేలారు. కారణం ఫిఫా ప్రపంచకప్‌లో తమ ఫుట్‌బాల్‌ జట్టు నాకౌట్‌లో కొలంబియాపై విజయం సాధించడమే. ఫిఫా ప్రపంచకప్‌లో నాకౌట్‌ దశలో ఇంగ్లాండ్‌, కొలంబియా మధ్య చివరి మ్యాచ్‌ జరిగింది. దీనిలో భాగంగా నిర్ణీత సమయంలోపు ఇరు జట్లు చెరో గోల్‌ చేసి 1-1తో స్కోరు సమంగా ఉండటంతో మ్యాచ్‌ అదనపు సమయానికి దారీ తీసింది.

అయితే అదనపు సమయంలోనూ పోరు హోరాహోరీగా సాగడంతో ఫలితంలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్‌పై ఆధారపడక తప్పలేదు. కాగా పెనాల్టీ షూటౌట్‌లో 4-3తో ఇంగ్లాండ్‌ విజయం సాధించి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది.

ఇదిలా ఉండగా, ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ కంటే ముందే మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌-భారత్‌ మధ్య తొలి టీ20 మ్యాచ్‌ జరిగింది. బంతితో కుల్‌దీప్‌ యాదవ్‌, బ్యాట్‌తో కేఎల్‌ రాహుల్‌ రెచ్చిపోవడంతో భారత్‌ ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. అయితే క్రికెట్‌లో ఓడినా.. తమ ఫుట్‌బాల్‌ జట్టు నాకౌట్‌లో గెలవడంతో ఇంగ్లాండ్‌ క్రికెటర్లు డ్రెస్సింగ్‌ రూమ్‌లో సంబరాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు తన ఇన్‌స్టాగ్రాం ద్వారా పంచుకుంది.

మళ్లీ ఫిఫా ప్రపంచకప్‌ మన ఇంటికి రాబోతుంది అంటూ తెగ మురిసిపోతూ కామెంట్‌ కూడా రాసుకొచ్చింది. 1966ప్రపంచకప్‌ ఫైనల్లో పశ్చిమ జర్మనీని ఓడించి ఇంగ్లాండ్‌ తొలిసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత నుంచి ఇంగ్లాండ్‌ నుంచి ఆ స్థాయిలో ప్రదర్శన రాలేదు. అయితే చివరగా 2006 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ క్వార్టర్స్‌కు చేరినా.. పోర్చుగల్‌ చేతిలో ఓడింది. ఆ తర్వాతి నుంచి మళ్లీ ఇంగ్లాండ్‌ క్వార్టర్స్‌కు చేరడం ఇదే తొలిసారి.

Story first published: Tuesday, July 17, 2018, 16:50 [IST]
Other articles published on Jul 17, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+