Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లాండ్ క్రికెట్‌లో అలజడి: 25 ఏళ్లకే అన్సారీ రిటైర్మెంట్

హైదరాబాద్: ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ జాఫర్ అన్సారీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్‌నే శ్వాసగా బ్రతికిన అన్సారీ ఇకపై క్రికెట్ ఆడనంటూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. క్రికెట్ అనేది తన జీవితంలో ఒక భాగంగానే మిగిలిపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఎంతో భవిష్యత్తు ఉన్న అన్సారీ 25 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోవడానికి వేరే లక్ష్యాలు ఉండటమే కారణమని అన్సారీ ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. గతేడాది అక్టోబర్‌లో బంగ్లాదేశ్ పర్యటనలో అన్సారీ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.

England cricketer Zafar Ansari retires at 25, to pursue law

ఆల్‌రౌండర్‌గా పేరొందిన అన్సారీ భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. భారత్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లో రెండు టెస్టు మ్యాచ్‌లు కూడా ఆడాడు. దాదాపు ఏడేళ్ల పాటు ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఉన్నా ఇది మాత్రం కచ్చితంగా వీడ్కోలు సమయమేనని అన్సారీ పేర్కొనడం విశేషం.



'ఎంతో జాగ్రత్తగా నిర్మించుకున్న నా క్రికెట్ కెరీర్‌ను ఒక్కసారిగా ముగిస్తున్నానని చెప్పడం చాలా బాధాకరం. కానీ తప్పదు. నాకు క్రికెట్ కంటే వేరే లక్ష్యాలు ఉన్నాయి. క్రికెట్‌తోనే ఉంటే నా జీవితంలో చాలా వాటిని మిస్సవుతాను. దాంతోనే క్రికెట్‌కు గుడ్ బై చెప్పాల్సి వస్తుంది. ఇది చాలా కఠిన నిర్ణయం. ఏదో ఆకతాయితనంగా తీసుకున్న నిర్ణయమైతే కాదు. ఎంతో ఆలోచించి తరువాతే నా కెరీర్ గురించి నిర్ణయం తీసుకున్నాను' అని అన్సారీ ఒక ప్రకటనలో తెలిపాడు.

'నాకు ఎనిమిదేళ్ల వయస్సు ఉన్నప్పుడ్నుంచి సర్రే జట్టుకు ఆడుతున్నా. ఇలా ఒక్కసారిగా వీడ్కోలు తీసుకోవడం బాధాకరమే. కాకపోతే నా జీవితంలో క్రికెట్ ఒక భాగం మాత్రమే. నేను పూర్తి చేయాల్సిన లక్ష్యాలు చాలానే ఉన్నాయి. ఆ క్రమంలోనే క్రికెట్ వీడ్కోలు నిర్ణయం' అని అన్సారీ తెలిపాడు.

ప్రస్తుతం న్యాయశాస్త్రం చదివేందుకు సిద్ధమవుతున్న తరుణంలో క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు అన్సారీ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ తరుపున మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడిన అన్సారీ 49 పరుగులు చేసిన 5 వికెట్లు తీశాడు. 2015లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యా‌చ్‌లో అన్సారీ వన్డే అరంగేట్రం చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+