25 బంతుల్లో సెంచరీ: ఒక ఓవర్‌లో 6 సిక్సులతో విధ్వంసం

హైదరాబాద్: క్రికెట్‌లో ఇప్పటివరకు ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్ చూసి ఉంటారు. కానీ, 20 ఏళ్ల ఇంగ్లాండ్ యువ క్రికెటర్ విల్ జాక్స్ విధ్వంసానికే విధ్వంసం చూపించాడు. దుబాయ్ వేదికగా జరిగిన టీ10 మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన విల్ జాక్స్ కేవలం 25 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. ఇందులో ఎనిమిది ఫోర్లు, పదకొండు సిక్సర్లు ఉన్నాయి.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు
ఈ క్రమంలో ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు అధికారిక హోదా లేకపోవడంతో ఈ మెరుపు ఇన్నింగ్స్‌కు అధికారికంగా రికార్డుల్లో చేరలేదు. టీ10 మ్యాచ్‌లో భాగంగా సర్రే జట్టుకు ఆడుతున్న విల్ జాక్స్.. లాంక్‌షైర్ జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. మొత్తం 11 సిక్స్‌లు, 8 ఫోర్లతో కేవలం 30 బంతుల్లోనే 105 పరుగులు చేశాడు.

14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మైలురాయిని అందుకున్న విల్ జాక్స్ ఆ తర్వాత 25 బంతుల్లో సెంచరీ మార్కుని అందుకున్నాడు. విల్ జాన్స్ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు గాను తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నస్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యఛేదనలో తడబడిన లాన్‌షైర్ 9.3 ఓవర్లలోనే 81 పరుగులకి ఆలౌటైంది.
95 పరుగుల తేడాతో భారీ విజయం
ఫలితంగా సర్రే జట్టు 95 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు అధికారిక హోదా ఇచ్చి ఉంటే.. ఐపీఎల్‌లో 30 బంతుల్లో సెంచరీ కొట్టిన క్రిస్ గేల్ రికార్డుని బద్దలు కొట్టేవాడే. ఒక దశలో తాను ప్రతి బంతినీ సిక్స్ కొట్టాలన్నట్లుగా ఆడానని మ్యాచ్ తర్వాత జాక్స్ చెప్పడం విశేషం. ఇటీవల తిరువనంతపురం వేదికగా భారత్-ఎ జట్టుతో తలపడిన ఇంగ్లాండ్ లయన్స్ జట్టులో జాక్స్ సభ్యుడిగా ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications