లండన్: ఉగ్రదాడుల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో పర్యటించేందుకు సహచర క్రికెటర్లు సంకోచిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇంగ్లాండ్ క్రికెటర్ మోయిన్ అలీ మాత్రం తాను పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమని చెప్పాడు. ఎక్కడా సురక్షితంగా ఉండలేమని ఆయన అభిప్రాయపడ్డాడు.

ఈ ఏడాది జులైలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఉగ్రదాడిలో దాదాపు ఇరవై మంది మృతి చెందారు. అక్టోబర్ ఏడో తేదీ నుంచి బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, రెండు టెస్ట్‌ల సిరిస్‌ను ఇంగ్లాండ్ ఆడాల్సి ఉంది. భద్రత కారణాల వల్ల ఇంగ్లాండ్ క్రికెటర్లు బంగ్లాలో పర్యటించేందుకు ఆసక్తి చూపించడం లేదు.
దీనిపై మోయిన్ అలీ మాట్లాడుతూ... ఈ కాలంలో ఎక్కడ సురక్షితంగా ఉంటామన్న నమ్మకం లేదని, సిరీస్‌కు తనను ఎంపిక చేస్తే వెళ్తానని చెప్పాడు. పర్యటనకు వెళ్లాలన్నది తన సొంత నిర్ణయమని, అలాగే ప్రతి ఒక్కరికి సొంత ఆలోచనలు ఉంటాయన్నారు.